Analyst Damu Balaji : తమ్ముడు, మరదలు కలిసి డాడీ హోమ్ రాజారెడ్డి ని చంపేశారు… వాస్తవంలోకి సంచలన విషయాలు…: అనలిస్ట్ దాము బాలాజీ

0
103

Analyst Damu Balaji : అనాధ పిల్లలు పాలిట దైవం ఆయన. అంగ వైకల్యం ఉన్న చిన్నారులను, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలను చేరదీసి వారితోనే జీవితం అంటూ గడుపుతున్న రాజారెడ్డి గారిని సొంత తమ్ముడు ఆతని భార్యే హత్య చేయడం కలకలం రేపింది. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మార్గంలో ఉన్న పూజా ఇంటర్నేషనల్ హైస్కూల్‌లో ఈ నెల 11వ తేదీ రాత్రి 10 గంటలకు పాఠశాల ఆవరణలోనే రాజారెడ్డి అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో మరణించారు. ఆయన మీద దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు ఆలస్యంగా తెలుసుకున్నారు. గొంతు నులిమి, ఊపిరి ఆడకుండా చేసి చంపేసినట్లు గుర్తించారు. తోలుత రాజారెడ్డి గుండెపోటుకు గురై కుప్పకూలారంటూ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఎలాంటి అనుమానం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేసి అంత్యక్రియలు చేసారు ఆయన తమ్ముడు, తమ్ముడు భార్య. ఇక ఈ ఇష్యూ మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

చంపి.. గుండె పోటుగా చిత్రికరణ….

రాజారెడ్డి గారికి పెళ్లి లేదు పిల్లలు లేరు. అనాధ పిల్లలనే ఆయన బిడ్డలుగా చూసుకుంటున్నారు. ఎంతో మంది అనాధ అలాగే హెచ్ఐవి బారిన పడిన చిన్నారులు, అంగ వైకల్యం ఉన్న చిన్నారులను చేరదీసి వారికి నాణ్యమైన విద్య అందించాలని పూజ ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టి సేవలందిస్తున్నారు. పూజ అనే అమ్మాయి కూడా ఒక ఆనాధ రైల్వే స్టేషన్ లో దొరికిన పసి పిల్లను ఆయనే పెంచుకుంటున్నారు. తాజాగా ఆయనకు పెద్దల నుండి సంక్రమించిన ఆస్తి బాగా విలువ పెరగడంతో ఆయన తన ఆస్తివాటా తమ పిల్లకు ఇవ్వాలని తమ్ముడు, తమ్ముడి భార్య అడిగారు. ఈ విషయంలో పలుమార్లు గొడవలు కూడా జరిగాయాంటూ బాలాజీ తెలిపారు.

అయితే ఆయన మొత్తం ఆస్తిని ట్రస్ట్ కి ఇచ్చేయాలని డిసైడ్ అవ్వడంతో అది భరించలేని వాళ్ళు ఆయనను కిరాయి వ్యక్తుల సహాయంతో కొట్టి గొంతు నులిమి చంపేశారు. ఆ పైన తెలిసిన డాక్టర్ సహాయంతో పోస్టుమార్టమ్ రిపోర్ట్ గుండె పోటు తో చనిపోయారు అని సృష్టించి పోలీసులను నమ్మించి అంత్యక్రియ్యలు చేసారు. అయితే స్కూల్ లో పిఇటి టీచర్ గా ఉన్న వ్యక్తి ఎస్పీ వద్దకు వెళ్లి మృతి మీద అనుమానాలు ఉన్నాయని చెప్పడంతో ఎస్పీ విచారణకు అదేశించి రీ పోస్టు మార్టం చేయించడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రాజారెడ్డి తమ్ముడు శ్రీధర్ రెడ్డి ఆయన భార్య పూజ ఇంటర్నేషనల్ స్కూల్ సీఈఓ గా ఉన్న లక్ష్మి ప్రసన్న ఇద్దరు ఇతర వ్యక్తులతో కలిసి హత్యకి పాల్పడినట్లు తెలుస్తోందని బాలాజీ చెప్పారు.