Analyst Damu Balaji : పిహెచ్డి భారతికి ఒకే కిడ్నీ… వెలుగులోకి వస్తున్న ఆసక్తికర విషయాలు…: అనలిస్ట్ దాము బాలాజీ

0
86

Analyst Damu Balaji: అనంతపురం జిల్లా శింగనమల కు చెందిన సాకే భారతి అనే మహిళ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగ్ వైరల్ అవుతోంది. సాకే భారతి చదువుకు పేదరికం, ఇంట్లోని వాతావరణం ఏమాత్రం అడ్డు కాదని నిరూపించిన తెలుగు మహిళ. ఏకంగా రసాయన శాస్త్రంలో డాక్టరేట్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. కూలి పనులకు వెళ్తూనే తన చదువుని అశ్రద్ధ చేయకుండా ఎటువంటి అదనపు తరగతులు, కోచింగ్ లేకుండానే బైనరీ మిక్చర్ అనే అంశం మీద పరిశోధనలు చేసి రసాయన శాస్త్రంలో శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ అందుకుంది. ఇక ఆమెకు తాజాగా ఎస్వీ యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చిందంటూ వస్తున్న వార్తల గురించి అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

ఒక కిడ్నీతో కష్టపడ్డ భారతి…

సింగనమల సాకే భారతి తాజాగా మీడియాలో ఫేమస్ అయ్యారు. మీడియా వాళ్ళు ఆమెకు తీరిక లేకుండా ఇంటర్వ్యూలను తీసుకుంటుండగా తాజాగా ఆమె తనకు ఒక కిడ్నీ మాత్రమే ఉందనే విషయం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది అంటూ బాలాజీ తెలిపారు. ఒక వైపు కూలి పనులను చేసుకుంటూ మరోవైపు చదువు సాగించిన భారతి ఒకసారి బాగా జ్వరం వచ్చేసరికి హాస్పిటల్ కి వెళ్లి చెక్ అప్ చేయించుకుంటే తనకు ఒక కిడ్నీ మాత్రమే ఉందనే విషయం తెలిసిందంట.

ఆ రోజునే డాక్టర్లు బరువులు ఎత్తడం లాంటివి చేయకూడదని చెప్పారట. అయితే భర్తకు సహకారంగా కూలి పనులను చేసే భారతి అలాగే కస్టపడి తన పిహెచ్డి ని ఏడేళ్లలో పూర్తి చేసారు. తాజాగా ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూలలో కూడా ఆమె ఎలాంటి కష్టమొచ్చినా చదువుకోవడం మానకండి అంటూ ఆడపిల్లలకు చెబుతోంది అంటూ బాలాజీ తెలిపారు. ఇక ఆమెకు ఎస్వి యూనివర్సిటీ లో ఉద్యోగం వచ్చింది, వైసీపీ వాళ్ళు ఇప్పించారనే ప్రచారం గురించి ఆమె మాట్లాడుతూ తన దాకా ఇంకా ఎలాంటి జాబ్ లెటర్ రాలేదని తెలిపారు. ఊరి వాళ్ళు అలాగే మరికొతమంది ఆర్ధిక సహాయం చేసినట్లు బాలాజీ తెలిపారు.