Analyst Damu Balaji : సినిమా తారల గురించి ఏదో ఒక గాసిప్ లేకుండా సోషల్ మీడియాలో గడవదు. జనాలకు లేని ఆసక్తిని కూడా వీళ్ళే సృష్టించేస్తుంటారు. అసలు నిజానికి అపద్దానికి తేడా లేకుండా ఈ మధ్య కాలంలో రకరకాల గాసిప్స్ వస్తుంటాయి. ఇక టాలీవుడ్ లో అయితే హీరోయిన్ సమంత, నాగచైతన్య ఇద్దరూ విడాకులు తీసుకున్న తరువాత ఎక్కువగా వారి గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. తాజాగా సమంత మళ్ళీ ప్రేమలో పడిందంటూ ఒక గాసిప్ వినిపిస్తుండగా ఆ విషయం గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

సినిమాలకు దూరమైన సమంత…
సమంత ఇటీవలే సినిమాలకు కొంతకాలం దూరం అవ్వాలనే నిర్ణయం తీసుకుని తన అభిమానులకు షాక్ ఇచ్చారు. నాగచైతన్య తో విడాకుల తరువాత వరుసగా సినిమాలను చేస్తున్న సమంత ఆ మధ్య మయోసైటీస్ ఆటో ఇమ్మ్యూన్ వ్యాధితో బాధపడుతూ అందుకు చికిత్స తీసుకుంటోంది. అయితే వ్యాధికి పూర్తిగా చికిత్స అందుకుని ఆ పైన సినిమాలలో మళ్ళీ బిజీ అవ్వాలని అనుకుంటున్న సమంత చేతిలో ఉన్న ఖుషి, సిటాడేల్ వెబ్ సిరీస్ లను పూర్తి చేసాక ఇక సినిమాలకు దూరమవ్వాలని భావించింది.

అమెరికా వెళ్లి అక్కడ చికిత్స చేయించుకోవాలని అనుకుంటున్నా సమంత మధ్యలో సమయం దొరకడంతో ఇండోనేషియాలోని బాలి కి వెళ్ళింది. అక్కడ తీసుకున్న ఒక ఫోటోను షేర్ చేస్తూ మనల్ని ఎంతో మంది ద్వేషిస్తారు అలాగే ప్రేమిస్తారు అంటూ రాసుకొచ్చిందని బాలాజీ తెలిపారు. ఇక ఆ పోస్ట్ మీద చాలా మంది భిన్నాభిప్రాయాలను వ్యక్తపరుస్తూ కొంతమంది మళ్ళీ సమంత ప్రేమలో పడింది అంటూ కామెంట్స్ పెట్టడంతో ఈ న్యూస్ వైరల్ అవుతోందని తెలిపారు.