Analyst Damu Balaji : జగన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టినపుడు ఆయన పరిస్థితి బాగోలేదు. అయినా పార్టీ పెట్టి పదేళ్ళు పార్టీని నడిపి నేడు సీఎం అయ్యాడంటే జగన్ ఒక్కడివల్లే ఇదంతా సాధ్యపడలేదు. ఒక సమయంలో చెల్లి షర్మిల పాదయాత్ర చేసి అన్నను జనాలు మర్చిపోకుండా చేస్తే మరోవైపు విజయ్ సాయి రెడ్డి కుడి భుజంలా ఉంటూ ఆయన ప్రతి విషయలోనూ తోడున్నాడు. వ్యూహాలను రచిస్తూ పార్టీని నిలబెట్టడంలో జగన్ తో పాటు విజయ్ సాయి రెడ్డి కృషి ఎంతైనా ఉంది. అలాంటి విజయ్ సాయి గారిని ప్రస్తుత జగన్ పక్కన పెడుతున్నాడు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీటి గురించి అనలిస్ట్ బాలాజీ తన అభిప్రాయాలను తెలిపారు.

అన్ని పదవులనూ దూరం చేసిన జగన్…
విజయ్ సాయి రెడ్డి గారు రాజ్య సభ మెంబెర్ గా ప్రస్తుతం ఉన్నారు. అయితే వైసీపీ పార్టీలో కీలక పదవులలో ఉండేవారు. ఆయన వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయ కర్తగా ఉండేవారు, తాజాగా ఇది వైవి సుబ్బారెడ్డి కి ఇచ్చారు. అలాగే వైసీపీ సోషల్ మీడియా కమిట్ కి ఇంచార్జి గా ఉండేవారు, దీన్ని ఇప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డికి ఇచ్చారు. ఇక వైసీపీ అనుబంధం విభాగల సమన్వయ కమిటీ చైర్మన్ గా కూడా ఉండేవారు. ఈ పదవి బాధ్యతలు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారు అంటూ బాలాజీ తెలిపారు.

అలా మూడు కీలకమైన పదవుల నుండి విజయ్ సాయి ని తొలగించడం వెనుక కారణం గురించి చర్చ మొదలయిందని తెలిపారు. విజయ్ సాయి కి వయసు ఎక్కువవడం వల్ల ఆయనను ఈ బాధ్యతల నుండి విముక్తున్ని చేస్తున్నట్లు జగన్ పార్టీ ప్లీనరీ కార్యక్రమంలో చెప్పినట్లు వినిపిస్తోందని బాలాజీ తెలిపారు. అదీ కాక మరోవైపు తారకరత్న మరణం సమయంలో జరిగిన పరిణామాల దృష్ట్యా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందరూ చర్చించుకున్నట్లు తెలిపారు.

































