Analyst Damu Balaji : జానకీపురం సర్పంచ్ నవ్య అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య వివాదం డైలీ సీరియల్ లాగా రోజూ వస్తూనే ఉంది. తాజాగా సర్పంచ్ నవ్య తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసారు. తాను ఇంటి నుండి బయటికి వెళితే తిరిగి వస్తానో లేదో తెలియడం లేదని, ఎమ్మెల్యే తనని చంపించాలని చూస్తున్నాడంటూ నవ్య ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఇష్యూ మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
నన్ను చంపేస్తారు కాపాడండి…
సర్పంచ్ నవ్య ను లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఆమె మీడియా ముందుకు గతంలో వచ్చింది. ఆ సమయములో ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి వచ్చి క్షమాపణలు కూడా చెప్పారు. ఇక మళ్ళీ ఇపుడు నవ్య తన భర్తను వాడుకుని తనని మళ్ళీ వేధించాలని చూస్తున్నాడని, తన భర్తకు డబ్బు ఆశ చూపి గతంలో చేసిన ఆరోపణలు ఆపద్దమని రాయించుకోవాలని చూసారు, అప్పుగా ఇరవై ఐదు లక్షలు ఇస్తామని బాండు పేపర్ మీద సంతకం చేయించుకోవాలని అనుకున్నారని నవ్య ఆరోపిస్తోంది అని బాలాజీ తెలిపారు. గతంలో ఆమె పై ఎమ్మెల్యే లైంగిక ఆరోపణాలు నిజం కావచ్చు వాటికి అపుడే క్షమాపణ చెప్పారు.
కాగా తాజాగా నవ్య ఆరోపిస్తున్న వాటికి రుజువులు చూపియ్యడం లేదు. బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెబుతోంది కానీ వాటిని బయటపెట్టడం లేదు అంటూ బాలాజీ తెలిపారు. మీడియా ముందు పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుండవచ్చు. నిజానికి గ్రామ అభివృద్ధి కోసం నిధులను ఇస్తానని ఎమ్మెల్యే చెప్పినపుడు అది ఆమె ఒక్కదాని సమస్య కాదు, ఉప సర్పంచ్ మిగిలిన మెంబెర్స్ ను తీసుకెళ్లి ఎమ్మెల్యేతో మాట్లాడిండవచ్చు, ఆలా కాకుండా నవ్య మాత్రమే మీడియా అటెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక పోలీసులు అడిగిన బెదిరింపు కాల్స్ కి సంబంధించిన ఫోన్ నంబర్స్ ఇవ్వడం లేదు, కేవలం మీడియా ముందు చెబుతున్నారు. ఇక ఇంత ఇష్యూ జరుగుతున్నా ఎమ్మెల్యే రాజయ్య స్పందించడం లేదు అంటూ బాలాజీ తెలిపారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…