Featured

Analyst Damu Balaji : బండి సంజయ్ తండ్రి రక్తపు మడుగులో… వాటర్ ట్యాంక్ కింద… అసలు ఎలా మరణించాడు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ అలానే బీజేపీ రెండూ నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహారిస్తున్నాయి. పొలిటికల్ హీట్ ను పెంచుతూ తాజాగా బండి సంజయ్ అరెస్టు రాష్ట్రవ్యాప్తంగా కాక పుట్టించింది. నిజానికి రేపో మాపో కెసిఆర్ కూతురు ఎమ్మెల్సి కవితక్క అరెస్టు అంటూ బాగా చర్చలు జరిగినా చివరికి బీజేపీ రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ ను ఉన్నపళంగా అరెస్టు చేయడంతో ఇప్పుడు ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ అరెస్టు తరువాత ఆయన నేపధ్యం రాజకీయాల్లోకి ఆయన ఆగమానం గురించిన చర్చలు ఎక్కువయ్యాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పయనం గురించిన ఆసక్తికర విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

బండి సంజయ్ తండ్రి అలా మరణించారు…

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ కి బీజేపీలో ఉన్న పేరు నిజాయితీగా కష్టపడి పనిచేస్తాడనే గుర్తింపు ఉంది. మొదటి నుండి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న బండి సంజయ్ కి అది తన తండ్రి నుండే వచ్చింది. తండ్రి నర్సయ్య కూడా ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన వ్యక్తే కావడం వల్ల చిన్నప్పటి నుండి బండి సంజయ్ బీజేపీ వైపు ప్రభావితం అయ్యారు. ఆయన కాలేజీలో చదివే రోజుల్లో బీజేపీ అనుబంధ సంస్థ ఏబివిపి లో పనిచేసారు. ఆ సమయంలో తన తండ్రి తోడ్పాటు బాగా ఉండేదట సంజయ్ కి. అలా ఒక్కో మెట్టు ఎదుగుతున్న సమయంలోనే తండ్రి నర్సయ్య రక్తపు మడుగులో మరణించడం సంజయ్ ను కలచి వేసింది.

తండ్రి నరసయ్య ఇంట్లో పైన వాటర్ ట్యాంక్ కింద శుభ్రం చేస్తున్న సమయంలో నిండుగా ఉన్న వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపోయి మీద పడి అక్కడికక్కడే ఆయన మరణించారు. ఆయన మరణించాక చాలాసేపటి వరకూ గమనించని ఇంట్లోని వాళ్ళు కుళాయి నుండి రక్తం రావడంతో అపుడు చూస్తే రక్తపు మడుగులో నర్సయ్య గారు ఉన్నారట. అలా తన రాజకీయ ఎదుగుదలను చూడకుండానే తండ్రి మరణించడం ఇప్పటికీ తీరని లోటు అంటూ సంజయ్ చెబుతారు. ఇక ఎక్కడికి వెళ్లినా తన తల్లికి కాళ్లకు నమస్కారం చేసే వెళ్తాడట బండి సంజయ్, ఇలా ఆయన వ్యక్తిగత విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago