Featured

Analyst Damu Balaji : వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్.. సిబిఐ కోర్టులో హైడ్రామా… హై కోర్టుకి సునీత రెడ్డి మరో పిటిషన్…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి కేసులో పూటకో కొత్త విషయం వెలుగులోకి వస్తూ డైలీ సీరియల్ ను తలపిస్తుండగా తాజాగా జైలులో రిమాండ్ లో ఉన్న భాస్కర్ రెడ్డి జైలులో గది మార్చాలని కోర్టుకి పిటిషన్ వేశారు. హాస్పిటల్ లో ఉన్న ఆయనను మళ్ళీ జైలుకి తరలించడంతో అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ రెడ్డి గారు తాజాగా బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఇక ఈ ఇష్యూకి సంబంధించిన విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

భాస్కర్ రెడ్డి కి బెయిల్…

వివేకానంద రెడ్డి హత్య కేసుతో సంబంధం ఉంది అనే కారణంతో సిబిఐ అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర్‌ రెడ్డిపై ఐపీసీ 120బీ, 302, 201 సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, వెన్నెముక సర్జరీ ఫెయిల్ అవడం వల్ల కింద పడుకోలేనని, సిబిఐ వేసిన మొదటి రెండు ఛార్జిషీట్స్ లలో తన పేరు లేదని కావాలనే నన్ను ఇంటికించాలని తరువాత నా పేరు చేర్చి అరెస్టు చేసారని, బెయిల్ ఇవ్వవలసిందిగా బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేయగా హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.

భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై స్పందించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోరింది. సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు డిఫెన్స్ న్యాయవాది ఇద్దరూ రేపు జూన్ 6న తమ వాదనలను సమర్పించనున్నారు అంటూ బాలాజీ తెలిపారు. ఇక సిబిఐ న్యాయవాదులతో కలిసి తన న్యాయవాదులు కలిసి పనిచేసుకునేందుకు వీలు కల్పించాలని సునీత రెడ్డి కోర్టుని అభ్యర్థించారని బాలాజీ తెలిపారు. సిబిఐ న్యాయవాధులకు తమ లాయర్లు సహాయం చేస్తారని అలాగే తాము ఇక్కడి వారే కావడం వల్ల సాక్షుల విషయంలో సహాయ పడగలమని చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago