Analyst Damu Balaji : సరూర్ నగర్ అప్సర హత్య కేసులో ఇప్పటికే సాయి కృష్ణ తానే చంపినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. అయితే ఈ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ తెలుస్తోంది. అప్సర బ్యాక్ గ్రౌండ్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె మొదటి భర్త మరణం, ఆపైన హైదరాబాద్ కి తల్లి కూతుళ్ళు రావడం, ఇక్కడ సాయికృష్ణ తో ఎఫైర్ వంటి విషయాల మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

ఆమె చావు దేవుడి తీర్పు…
అప్సర కుటుంబం మొదట చెన్నైలో ఉండేవారట. అక్కకి అక్కడే పెళ్ళి అవగా అప్సర, ఆమె తల్లి కలిసి ఉండేవారు. అయితే అప్సర కార్తీక్ రాజా అనే వ్యక్తిని ప్రేమించింది. అతను సాఫ్ట్ వేర్ ఇంజనీర్. వారి ప్రేమ విషయం కార్తిక్ రాజా ఇంట్లో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె బ్యాక్ గ్రౌండ్ విచారించినపుడు అప్సర అక్క బావ చీటింగ్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చారని తెలిసినా కొడుకు కోసం పెళ్లి చేసారు. పెళ్ళైన సమయంలో అప్సర కు కార్తీక్ కుటుంబమే బంగారం చేయించారు. పెళ్ళైన కొంతకాలనికే వేరు కాపురం పెట్టించింది అప్సర. ఇక అప్పటినుండి డబ్బుకోసం తల్లి కూతుళ్లు కార్తీక్ రాజాను వేధించడం మొదలు పెట్టడం జరిగిందట. అలా డబ్బు ఇవ్వకపోవడంతో కార్తీక అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీస్ కేసు పెట్టి జైలులో పెట్టించడంతో జైల్ నుండి బయటికి వచ్చిన కార్తీక్ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

అంత్యక్రియల సమయంలో కూడా అక్కడ లేకుండా అప్సర ఆమె తల్లి పరారీ అయి హైదరాబాద్ వచ్చేసారట. ఈ కథంతా కార్తీక్ తల్లి ధనలక్ష్మి గత కొద్ది రోజులుగా తెలుగు మీడియాలో అప్సర హత్య గురించి రావడంతో తెలుసుకుని యూట్యూబ్ ఛానెల్ ను ఆశ్రయించి తెలిపారు. అప్సర చనిపోవడం దేవుడి తీర్పు అంటూ చెప్పారు. ఆమె సాయికృష్ణ ను కూడా నా కొడుకు లాగే మోసం చేయాలనుకుంది కానీ తాను అనుకున్నట్లు జరగలేదు అంటూ చెప్పారు. ఇక అప్సర మరణానికి కారణం సాయికృష్ణ కాదు అప్సర తల్లి ఆమె అత్యాశ అంటూ ఆమె తెలిపారని బాలాజీ తెలిపారు. ఈమె చెప్పిన విషయాలు కేసులో ప్రభావం చూపుతాయని బాలాజీ తెలిపారు.































