Analyst Damu Balaji : హీరో జేడి చక్రవర్తి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఆయన ఎన్నో సినిమాల్లో హీరోగాను విలన్ గాను నటించి మెప్పించారు. అయితే తాజాగా ఆయన యూట్యూబ్ లో ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మీద విష ప్రయోగం జరిగినట్లు, అది తన భార్యే చేసినట్లు పరోక్షంగా చెప్పారు. ఒక్కసారిగా ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

విచారణ చేయనున్న పోలీసులు…
జేడి చక్రవర్తి, అనుకృతి శర్మ అనే నటిని వివాహం చేసుకున్నారు. వీరి మధ్య మనస్పర్తల కారణంగా విడాకులు కూడా తీసేసుకున్నారు. అయితే తాజా ఇంటర్వ్యూలో జేడి చక్రవర్తి ఆమె స్లో పాయిజన్ ద్వారా చంపాలని అనుకుందని చెప్పారు. 99% మరణిస్తానని అనుకుంటే చివరికి బ్రతికానని ఎక్కడెక్కడో విదేశాల్లో చూపించుకున్నా నయం కాలేదని, హైదరాబాద్ లో ఒక డాక్టర్ డ్రగ్స్ కి సంబంధించిన పరీక్షలు నిర్వహించినపుడు విషయం బయటపడిందని తెలిపారు చక్రవర్తి.

ఇక ఈ విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదని ఇపుడు అందరికీ తెలుస్తుందని ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఈ విషయంలో ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నట్లు బాలాజీ తెలిపారు. విష ప్రయోగం చేయడం మనిషి ప్రాణాలను తీయాలనుకోవడం నేరాలు, ఈ సంఘటన జరిగినపుడే జేడి చక్రవర్తి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉండాల్సింది. అయితే అపుడు సైలెంట్ గా ఉండటం వల్ల ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పడం వల్ల ఆయన కూడా ఇబ్బందుల్లో పడుతారు. అలాగే ఆయనకు చికిత్స అందించిన డాక్టర్స్ కూడా విషయం పోలీసులకు చెప్పకపోవడం నేరమే అవుతుంది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

































