Analyst Dasari Vignan : ప్రముఖ గాయని వాణి జయరాం అనుమానాస్పద స్థితిలో ఆమె ఇంట్లోనే మరణించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆమె మరణం సహజ మరణం కాదు అని ఎవరో హత్య చేసారు అనే పుకార్లు బాగా వినబడ్డాయి. ఇక ఆమె ముఖం మీద గాయాలు ఉండటం వల్ల ఈ వదంతులు ఎక్కువయ్యాయి. అయితే వాణి జయరాం కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె మరణం మీద ఎలాంటి అనుమానాలు లేవంటూ చెప్పారు. సహజంగానే మరణించినట్లు పోలీసులు తేల్చారు. అయినా ఈ విషయంలో ఎన్నో అనుమానాలు అలానే ఉన్నాయి. ఇక ఆమె ఎలా మరణించారో, ప్రాణం పోవడానికి గల కారణాలను దాసరి విజ్ఞాన్ వివరించారు.

ప్రాణం తీసిన గ్లాస్ టేబుల్…
వాణి జయరాం గారి మరణం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక ఆమె తల, ముఖం మీద గాయాలు ఉండటంతో ఆమెది సహజ మరణం కాదేమో అనే అనుమానాల నడుమ పోస్టుమార్టం రిపోర్ట్ లో ఆమె మరణం అనుమానాస్పద్ధం కాదని వెళ్లడయింది. దాసరి విజ్ఞాన్ మాట్లాడుతూ వాణి జయరాం గారు మరణించడానికి కారణం ఆమె రూమ్ లో ఉన్న గ్లాస్ టేబుల్ అంటూ చెప్పారు. ఆమె కాలు జారి గ్లాస్ టేబుల్ కి పడటంతో తల ముందు భాగంలో గ్లాస్ టేబుల్ తగిలి గాయమై బాగా రక్తం పోయి ఆమె మరణించారు. సాధారనంగా ఇంట్లో వాడే అలంకరణ వస్తువులకు వాడే గ్లాస్ వస్తువులకు గ్లాస్ చాలా మందంగా ఉంటుంది అంత ఈజీగా పగలదు. అయితే వాణి జయరాం గారి గ్లాస్ టేబుల్ అలా ఎలా పగిలిందో మనకి తెలియదు, అది తగిలి ఆమె చనిపోవడం నమ్మశఖ్యంగా లేదు అంటూ చెప్పారు.

ఇక ఆమె మరణం తరువాత ఆమె అంత్యక్రియలకు కూడా పెద్దగా బంధువులు రాలేదట. కారణం ఆవిడ పిసినారితనమే అనే కామెంట్స్ వినిపించాయి అంటూ ఏది ఏమైనా మన ఇంట్లో మనం తెచ్చుకునే వస్తువులే మన ప్రాణం తీస్తే చాలా దారుణంగా ఉంటుంది, అందుకే ఏదైనా వస్తువు కొన్నపుడు ముఖ్యంగా గ్లాస్ వస్తువులు కొన్నపుడు కొంచెం నాణ్యమైనవి తెచ్చుకోవాలి, నాసిరకం గ్లాస్ వస్తువులు ప్రమాదవశాత్తు పగిలినపుడు మనకే ప్రమాదం ఆంటూ విజ్ఞాన్ ఆయన అభిప్రాయాలను తెలిపారు.































