Categories: FeaturedMovie News

Anasuya Bharadwaj : అనసూయకు వీడ్కోలు చెబుతూ ఎమోషనల్ అయిన జబర్దస్త్ టీమ్..!

Anasuya Bharadwaj : ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద ప్రసారమవుతున్న ప్రోగ్రాములలో జబర్దస్త్ కు చాలా ప్రత్యేకత వుంది. షో మొదలు అయిన రోజు నుండి ఈరోజు వరకూ టాప్ రేటెడ్ ప్రోగ్రాములలో ఒకటిగా కొనసాగుతోంది. అంతేకాకుండా చాలా మంది నటీనటులను పరిచయం చేసింది. అయితే ఈ మధ్య జబర్దస్త్ ను కొన్ని కారణాల వలన చాలా మంది విడిచి వెల్లిపోతున్నారు. ఈకోవలోనే జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న అనసూయ కూడా వదిలి వెళ్ళిపోతోంది. దీని గురించి అనసూయ ఇంతకుముందే చెప్పినప్పటికీ, జబర్దస్త్ టీమ్ లేటెస్ట్ ఎపిసోడులో కంఫర్మ్ చేసింది. దీనికి సంబందించిన ప్రోమో ఇపుడు వైరల్ అవుతోంది.

నెలలో మూడు రోజులు కేటాయించలేవా…

తాజాగా విడుదలైన ప్రోమోలో అనసూయ జబర్దస్త్ ను విడిచి వెళ్లిపోయిన విషయాన్ని షో నిర్వాహకులు కంఫర్మ్ చేశారు. చలాకీ చంటి అయితే తన స్కిట్‌ లో అనసూయకు ఇదే లాస్ట్‌ ఎపిసోడ్‌ అంటూ కామెంట్‌ కూడా చేశాడు. తాగుబోతు రమేశ్‌ ఏకంగా అనసూయ గెటప్ వేసి స్కిట్‌ చేశాడు. అనసూయ గెటప్‌ వేసిన తాగుబోతు రమేశ్‌ చంటి పిల్లలు ఉన్న సమయంలో కూడా, అనసూయ జబర్దస్త్ కోసం ఎలా కష్టపడిందో చెబూతు అందరి చేత కన్నీళ్లు పెట్టించాడు.

నెలకు మూడు రోజులు జబర్దస్త్ షో కోసం కేటాయించలేవా అని చంటి నిలదీసాడు. ఇక జడ్జి గా వ్యవహారిస్తున్న ఇంద్రజ ఎమోషనల్‌ అయ్యారు. ఖచ్చితంగా ఈ షో మిమ్మల్ని మిస్‌ అవుతుంది అంటూ అనసూయను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. “ఎంతో మందికి ఈ షో జీవితాన్ని ఇచ్చింది, ఇకపై కూడా ఇస్తూనే ఉంటుంది. ఈ షోకి ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే జబర్దస్త్‌ మాత్రం పర్మినెంట్‌” అంటూ కంటెస్టెంట్లు అందరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ షో కి సంబందించిన ప్రోమో వైరల్ అవుతోంది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago