Naga Chaitanya – Samantha: అక్కినేని నాగచైతన్య సమంత వీరిద్దరూ విడిపోయిన వీరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇకపోతే సమంత తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు. అయితే ఈ షోలో భాగంగా సమంత నాగచైతన్య గురించి సమంత కాస్త వెటకారంగా మాట్లాడినట్టే అనిపించింది. కరణ్ జోహార్ నాగచైతన్యను ఉద్దేశిస్తూ మీ భర్త అని సంబోధించగా భర్త కాదు మాజీ భర్త అంటూ కౌంటర్ వేసింది.
ఇకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో నన్ను నాగచైతన్యను ఒకే గదిలో పెడితే కత్తులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని సమంత చైతన్య గురించి మాట్లాడింది. ఇకపోతే చైతన్య పేరు ఎత్తగానే ఆమె ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోవడమే కాకుండా పెళ్లయిన తర్వాత తన జీవితం కేజిఎఫ్ సినిమాలో హీరోయిన్ లా మారిపోయిందని కాస్త చైతన్య గురించి వెటకారంగా మాట్లాడింది.
అయితే సమంత నాగచైతన్య గురించి ఇలా మాట్లాడటంతో కేవలం చైతన్య అభిమానులు మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఈమె వ్యవహార శైలిని తప్పుపట్టారు.ఇకపోతే మరోవైపు సమంత గురించి నాగచైతన్య మాట్లాడుతూ ఎలాంటి నెగటివ్ కామెంట్స్ కాకుండా ఆన్ స్క్రీన్ ఎవరితో మీకు కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవుతుందని ప్రశ్నించగా సాయి పల్లవి, సామ్ అంటూ ఎంతో హుందాగా సమాధానం చెప్పారు.
ఈ క్రమంలోనే చైతన్య అభిమానులు అది మా హీరోకి నీకు తేడా అంటూ పెద్ద ఎత్తున ఈమెపై ట్రోలింగ్ చేస్తున్నారు.అయితే గతంలో చైతన్య గురించి సమంత ఎంతో మంచిగా ఎంతో ప్రేమగా మాట్లాడారు కానీ ఇప్పుడు ఇలా సమంత మాట్లాడటంతో అభిమానులు ఆమెను తప్పు పట్టడమే కాకుండా మరోసారి ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…