Anasuya: బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వెండి తెర సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తున్న ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో తనకు వేరే అవకాశం లేక జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఈ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి అనసూయ సినిమా అవకాశాలను అంది పుచ్చుకున్నారు. అయితే సినిమా అవకాశాల కోసం చివరికి ఈ కార్యక్రమం నుంచి దూరమయ్యారు. అయితే ప్రస్తుతం తనకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయ లేకపోతే బుల్లితెరపై మంచి ఆఫర్ వచ్చాయో తెలియదు కానీ తిరిగి బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చారు.
ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్యక్రమాలలో అనసూయ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో అనసూయ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమా గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పవన్ సినిమా అంటే ఎలాంటి వారైనా నటించడానికి ఆసక్తి చూపుతారు. అది చిన్న పాత్ర అయినా అందులో నటించడానికి ఆసక్తి చెబుతారు.
అత్తారింటికి దారేది..
ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సమంతా పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా ఎలాంటి సక్సెస్ అందుకున్న మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఇట్స్ టైం టు పార్టీ నౌ అని పాటలో అనసూయకి ఛాన్స్ వచ్చింది. ఈ పాటలో నటించడానికి ఇష్టం లేక రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో అనసూయ తెలియచేయడంతో పవన్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కాలిగోటికి కూడా సరిపోవు ఆయన సినిమాలన్నీ రిజెక్ట్ చేసే స్థాయిలో ఉన్నావా అంటూ విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…