బుల్లితెరపై మెరిసి ఇప్పుడు వెండితెరపై ఫుల్ బిజీ గా మారిపోయిన యాంకర్, నటి అనసూయ.. జబర్దస్త్ షో ఆమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అంతకుముందు చిన్న చిన్న షో లు చేసినా రాని గుర్తింపు జబర్దస్త్ అనే ఒక్క షో తో వచ్చింది.. ఆ షో లో వచ్చిన గుర్తింపుతోనే ఆమె సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. క్షణం సినిమా తో పూర్తి స్థాయి నటిగా మారిన అనసూయ ఆ తర్వాత వెండితెరపై ఇక వెనుతిరిగి చూసుకోలేదు.. వరుస సినిమాలు చేస్తూ వెండి తెరపై ప్రేక్షకులను అలరిస్తుంది. ఆ సినిమా లో నెగెటివ్ రోల్ అదరగొట్టి తనలోని కొత్త యాంగిల్ ని చూపెట్టింది.
ఇక రంగస్థలంలో తన నట విశ్వరూపం చూపించింది. ఆ సినిమా తో నటిగా తన పెర్ఫార్మన్స్ ఎంత ఇంప్రూవ్ అయ్యిందో కూడా చెప్పేసింది. ఇప్పుడు ప్రేత్యేకంగా ఆమెకోసం సినిమాలు చేస్తున్నారంటే ఆమెకు మినీ సైజు హీరోయిన్ మార్కెట్ ఏర్పడింది అని చెప్పొచ్చు.. కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా ఆమె నటించింది. టీవీ, బిగ్ స్క్రీన్ లలోనే కాదు సోషల్ మీడియా లోనూ అనసూయ ఎంతో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ’30 క్వశ్చన్స్ విత్ అనసూయ’ అనే స్పెషల్ వీడియో చేసి అన్ని ప్రశ్నలపై నేరుగా సమాధానాలిచ్చింది.
ఇందులో భాగంగానే తన టాటూ సీక్రెట్స్ రివీల్ చేసింది ఈ జబర్దస్త్ బ్యూటీ.తామిద్దరం ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాక సంవత్సరంన్నర తర్వాత పెళ్లి చేసుకున్నామని, దీంతో ఆ ఎంగేజ్‌మెంట్ యానివెర్సరీ డే సందర్భంగా అలా ఎదపై నిక్కు అనే టాటూ వేయించుకున్నానని అనసూయ తెలిపింది. ఇక చేతిపై ఉన్న టాటూ కేలర్ అని, దీని అర్థం ‘బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యానికి విలువనివ్వడం’ అని చెప్పింది. ఇక త్వరలో మరో టాటూ కూడా వేయించుకోబోతున్నట్లు అనసూయ వెల్లడించడం విశేషం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…