Anchor Anasuya: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ యాంకర్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె అనంతరం సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.ఇలా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ బుల్లితెరకు గుడ్ బై చెప్పారు.
ఇక వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఎప్పటికప్పుడు తన అందాన్ని రెట్టింపు చేసుకుంటూ అందాన్ని కాపాడుకుంటూ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధిక శరీర బరువు పెరగకుండా ఎప్పుడు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటూ వ్యాయామాలు చేస్తూ మనకు కనపడుతూ ఉంటారు.
ఇలా ఫుడ్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ డైట్ ఫాలోఅవుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల కారణంగా మనం పెట్టుకున్న నియమాలను అతిక్రమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అనసూయ కూడా తన ఫుడ్ డైట్ బ్రేక్ చేశారని తెలుస్తోంది.గత కొద్ది రోజుల క్రితం తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా అనసూయ వెకేషన్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.
ఇలా వెకేషన్ వెళ్లినటువంటి ఈమె అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తన డైట్ బ్రేక్ చేశారని తెలుస్తుంది. దీంతో శరీర బరువు పెరిగినట్టు అనిపించడంతో ఈమె వెంటనే పెరిగిన బరువును తగ్గించడానికి భారీగా జిమ్ లో వర్కౌట్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేసిన అనసూయ తినడం ఎందుకురా బాబు అంటూ తాను ఫుడ్డు తిని ఇలా కష్టపడుతున్నందుకు పశ్చాత్తాపడుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…