Movie News

ఎప్పుడు గొడవలే అంటూ సంసారం గుట్టు విప్పిన అనసూయ?

బుల్లితెర అందాల యాంకర్ గా, వెండితెర అద్భుతమైన నటిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న అనసూయ తన వ్యక్తిగత జీవితం గురించి అనేక సందర్భాలలో అభిమానులతో ముచ్చటించారు. తన జీవితంలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయని,తన ప్రేమ పెళ్లి గురించి సినిమా తీయొచ్చని తెలిపిన సందర్భాలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్ గురించి ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.ఎన్‌సీసీ క్యాంప్‌లోతన ప్రేమ మొదలైందని ముందుగా తన ప్రేమ గురించి కాకుండా పెళ్లి చేసుకుందాం అనే ప్రపోజల్ తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు. తొమ్మిది సంవత్సరాల ప్రేమ తరువాత పెద్దలను ఒప్పించి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యామని ఈ యాంకరమ్మ ఎన్నో సందర్భాలలో తెలిపారు.

ఈ క్రమంలోనే నేడు వాళ్ళ 11 వ వివాహ దినోత్సవం సందర్భంగా తన సంసారం గుట్టును విప్పారు.తన భర్త ఇంట్లో ఎలా ఉంటారు.. ఏంటి.. అనే విషయాలను అభిమానులతో పంచుకున్నారు.ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ ఇంట్లో తరచూ గొడవలు పడుతున్నాము. మా మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయి. గొడవలు జరిగిన సమయంలో ఏవేవో పిచ్చి పనులు చేస్తూ ఉంటాము. కొన్ని సందర్భాలలో మా మధ్య ఎన్నో భేదాభిప్రాయాలు మనస్పర్థలు కూడా తలెత్తుతుంటాయని తెలిపారు.

ఈ విధంగా మా ఇద్దరి మధ్య గొడవ జరిగిన వెంటనే ఒకరి చేతిని ఒకరు పట్టుకుని మా మధ్య జరిగిన గొడవలు అన్నింటిని మర్చిపోతాము. అందువల్లే మా ప్రయాణాన్ని ఇన్నిరోజులు కొనసాగించామని నేడు వివాహ దినోత్సవం అయినప్పటికీ ఈ రోజు కూడా పోట్లాడుకున్నామని అందుకే ఎలాంటి కొత్త ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయలేదని ఈ సందర్భంగా అనసూయ తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago