అక్కినేని వారసుడు నాగచైతన్య, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రేమించకొని ఐదు సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.వీరి పెళ్లి జరిగి దాదాపు ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఎలాంటి శుభవార్తను చెప్పకపోవడంతో అభిమానుల దృష్టి మొత్తం వారికి రాబోయే వారసుడిపై ఉంది. ఈ క్రమంలోనే సమంత తల్లి కాబోతుందా అనే విషయం గురించి ఇప్పటికే ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై సమంత స్పందిస్తూ కొంతమేర అసహనం వ్యక్తం చేశారు.
తాజాగా మరోసారి సమంత సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు మొత్తం సమంత తల్లి కాబోతుందా?గర్భవతివా? త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటూ వివిధ రకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా నెటిజనులు కామెంట్ చేయడానికి గల కారణం ఏమిటంటే ఆ ఫోటోలో సమంత ఎంతో క్యూట్ గా కూర్చుని మామిడిపండు వైపు తదేకంగా చూడటం ఇందుకు కారణమని చెప్పవచ్చు.
ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ ఫోటోలో అందరి చూపు సమంత వైపు కాకుండా మామిడికాయ వైపు పడటంతో ఈ విధమైనటువంటి సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే సమంత ఈ విధంగా ఫోటో షేర్ చేయడం వెనుక కారణం ఏమిటంటే.. సమంత సినిమా రంగంలో పాటు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే తన దుస్తుల వ్యాపారమైన సాకీ దుస్తులను ప్రమోషన్ లో భాగంగా సమంత ఈ విధమైనటువంటి డ్రెస్ ధరించి బయట కూర్చుని ఉన్నటువంటి ఫోటోను షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలో మామిడికాయ ఉండటంతో అందరి ఫోకస్ దానిపై పడటం వల్ల ఈ విధమైనటువంటి సందేహాలు తలెత్తాయని చెప్పవచ్చు. నిజంగానే సమంత తన అభిమానులకు ఎప్పుడు శుభవార్త చెబుతారో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…