Movie News

Anchor Anasuya: బెదిరిస్తే భయపడేది లేదు.. చీల్చి చెండాడుతా అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిన అనసూయ?

Anchor Anasuya: యాంకర్ గా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ వెండితెర ప్రేక్షకులను కూడా సందడి చేసింది. ఇకపోతే ఈమె రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసింది.ఈ పాత్రతో ఎంతో మంచి గుర్తింపు పొందిన అనసూయకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

ప్రస్తుతం ఈమె అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా మొదటిసారిగా అనసూయ యాక్షన్ సన్నివేశాలలో నటించిన దర్జా అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రమంలోని ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా అనసూయ పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనలేక పోయినందుకు చిత్ర బృందం తనని క్షమించాలంటూ అందరికీ క్షమాపణలు చెప్పారు.ఇక ఈ సినిమాలో మొదటిసారి తను యాక్షన్ సన్నివేశాలలో నటించానని అనసూయ వెల్లడించారు. ఏకంగా చీరకట్టులో యాక్షన్ సన్నివేశాలు చేయించారని ఈమె తెలిపారు. ఎంతో విభిన్నమైన అద్భుతమైన కథతో తెరకెక్కిన ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించినందుకు పిఎస్‌ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ కి కృతజ్ఞతలని వెల్లడించారు.

మాస్ డైలాగ్ తో అంచనాలు పెంచిన అనసూయ…

ఇక ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందో అనసూయ ఒక మాస్ యాక్షన్ డైలాగుతో చెప్పేశారు.ఈ సందర్భంగా ఈమె ఈ సినిమాలో డైలాగ్ చెబుతూ నువ్వు బెదిరిస్తే భయపడటానికి ఇంట్లో కూర్చునే ఆడదాన్ని అనుకున్నావ్ రా… చీల్చి చెండాడేస్తా నా కొడకా అంటూ ఈ సినిమాలో డైలాగ్ ఎంతో దర్జాగా చెప్పేశారు. ఈ సందర్భంగా అనసూయ చెప్పిన ఈ డైలాగ్ చూస్తుంటేనే ఈమె పాత్ర ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ఇలా అనసూయ మాటలతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూలై 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాత్రి మిగిలిన అన్నం పారేస్తున్నారా? తెలుసుకుంటే ఇక వెతికి మరీ తింటారు!

చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…

13 minutes ago

బాలీవుడ్‌లో దక్షిణాది నటీమణులపై వివక్ష?.. రెజీనా సంచలన వ్యాఖ్యలు…

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…

24 minutes ago

గ్రూప్ స్టేజ్ ముగిసింది.. సూపర్-8 సంగ్రామం మొదలు! టీమిండియాకు అసలు పరీక్ష ఇప్పుడు…

2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…

39 minutes ago

“ఇస్రోలో ఇంటర్న్‌షిప్ ఛాన్స్.. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో దరఖాస్తులు ప్రారంభం!”

అంతరిక్ష రంగంలో కెరీర్‌ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…

52 minutes ago

“దేశంలో ఎక్కడా లేని శివలింగం.. తిరుపతి సమీపంలోనే అరుదైన అద్భుతం!”

తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…

1 hour ago

“తమిళ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్?.. స్టాలిన్‌ను కలిసిన ఓపీఎస్!”

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…

1 hour ago