Niharika: నిహారిక కొణిదెల ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి వారసులుగా వచ్చారు.అయితే మెగా వారసురాలిగా ఇండస్ట్రీలోకి నిహారిక మాత్రమే అడుగుపెట్టారు.నిహారిక కెరియర్ మొదట్లో బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించేది. ఇలా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె అనంతరం ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా వెండి తెరపై అడుగు పెట్టారు.
నిహారిక హీరోయిన్ గా నటించిన మూడు సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయకపోవడంతో ఈమె వెబ్ సిరీస్ లలో నటించడం మొదలుపెట్టారు.ఇలా వెబ్ సిరీస్లలో నటిస్తున్న సమయంలోనే నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత ఈమె నటనకు దూరంగా ఉన్నప్పటికీ వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మారారు.
ఇలా నిర్మాతగా పలు సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్న నిహారిక తాజాగా దేవుళ్ళు సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ నిత్య శెట్టి హీరోయిన్ గా హలో వరల్డ్ అనే సినిమాని నిర్మించబోతున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందంతో కలిసి ఈమె క్యాష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిహారిక తమ వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఎప్పటిలాగే యాంకర్ సుమ ఈ కార్యక్రమంలో వీరి చేత పలు టాస్కులు ఆడించడమే కాకుండా కొన్ని ప్రశ్నలు వేసి వీరి నుంచి సమాధానాలు రాబట్టారు.
ఈ క్రమంలోనే సుమ నిహారికను ప్రశ్నిస్తూ.. నీ మాటలతో, నీ చేష్టలతో మెగాస్టార్ చిరంజీవి గారిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిలో ఎవరిని తొందరగా కరిగిస్తావు, ఇద్దరిలో ఎవరు నీ మాటలను తొందరగా నమ్ముతారని ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు నిహారిక సమాధానం చెబుతూ పేద నాన్నను తొందరగా కరిగించవచ్చు. పెదనాన్నను ఏ విషయంలోనైనా తొందరగా నమ్మించి బుట్టలో వేసుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ బాబాయ్ తో చాలా కష్టం అంటూ నిహారిక అసలు సీక్రెట్ బయటపెట్టారు. ఇలా నిహారిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…