Anchor Anasuya: యాంకర్ గా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ వెండితెర ప్రేక్షకులను కూడా సందడి చేసింది. ఇకపోతే ఈమె రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసింది.ఈ పాత్రతో ఎంతో మంచి గుర్తింపు పొందిన అనసూయకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.
ప్రస్తుతం ఈమె అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా మొదటిసారిగా అనసూయ యాక్షన్ సన్నివేశాలలో నటించిన దర్జా అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రమంలోని ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా అనసూయ పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనలేక పోయినందుకు చిత్ర బృందం తనని క్షమించాలంటూ అందరికీ క్షమాపణలు చెప్పారు.ఇక ఈ సినిమాలో మొదటిసారి తను యాక్షన్ సన్నివేశాలలో నటించానని అనసూయ వెల్లడించారు. ఏకంగా చీరకట్టులో యాక్షన్ సన్నివేశాలు చేయించారని ఈమె తెలిపారు. ఎంతో విభిన్నమైన అద్భుతమైన కథతో తెరకెక్కిన ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించినందుకు పిఎస్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ కి కృతజ్ఞతలని వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందో అనసూయ ఒక మాస్ యాక్షన్ డైలాగుతో చెప్పేశారు.ఈ సందర్భంగా ఈమె ఈ సినిమాలో డైలాగ్ చెబుతూ నువ్వు బెదిరిస్తే భయపడటానికి ఇంట్లో కూర్చునే ఆడదాన్ని అనుకున్నావ్ రా… చీల్చి చెండాడేస్తా నా కొడకా అంటూ ఈ సినిమాలో డైలాగ్ ఎంతో దర్జాగా చెప్పేశారు. ఈ సందర్భంగా అనసూయ చెప్పిన ఈ డైలాగ్ చూస్తుంటేనే ఈమె పాత్ర ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ఇలా అనసూయ మాటలతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూలై 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…