బుల్లితెర పైప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ఎంతో మందికి ఎంతో మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది. ఈ కార్యక్రమంలో పలువురు కమెడియన్లు చేసే స్కిట్ ల ద్వారా ఎనలేని అభిమానులను సంపాదించుకుని వెండితెరపై కూడా మంచి అవకాశాలతో రాణిస్తున్నారు. అలాంటి కమెడియన్ లలో హైపర్ ఆది ఒకరు.
జబర్దస్త్ వేదికపై హైపర్ ఆది తన స్కిట్ లో చేసే రచ్చ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ప్రతి వారం తన స్కిట్ లో భాగంగా ఎవరో ఒకరిని పరిచయం చేయడం పరిపాటిగా వస్తోంది. ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి హైపర్ ఆది ముగ్గురమ్మాయిలతో ఎంతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. వాళ్ళతో పాటే యాంకర్ అనసూయని కూడా స్కిట్ లో భాగం చేశాడు. వీరందరూ కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా వచ్చేవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో హైపర్ ఆది మాట్లాడుతూ.. ఆ సమయంలో నీతో బ్రేక్ ఫాస్ట్ చేస్తా.. మధ్యాహ్నం నీతో లంచ్ చేస్తా అన్నాడు. ఈ క్రమంలోనే అనసూయ వైపు చూస్తూ నీతో అన్నబోయే సరికి ఆమె చంపేస్తా అంటుంది. దీనికి అందుకే మీతో ఏం చేయట్లే అంటూ హైపర్ ఆది బదులిచ్చాడు. ఆ తరువాత హైపర్ ఆది అనసూయను నువ్వు మంచం రెడీ చేసి పెట్టు అని అన్నాడు. అలాగే డాన్సర్ తేజస్వితో నువ్వు మల్లెపూలు రెడీగా పెట్టు… అనగా అప్పుడు పక్కనే ఉన్న రోహిణి మరి నేనేం చేయాలి అని అడగగా అందుకు హైపర్ ఆది నువ్వు బయటకు వెళ్లి తలుపు గొళ్లెం పెట్టు అంటూ పంచులు వేయడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…