Anchor Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఈ కార్యక్రమం రేటింగ్ కోసం సుడిగాలి సుదీర్ తో కలిసి పెద్ద ఎత్తున లవ్ డ్రామా నడిపించారు.ఇప్పటికీ సుదీర్ రష్మీ గురించి ఇలాంటి వార్తలు వినపడుతూ ఉన్నప్పటికీ వీరిద్దరూ మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే.
ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే రష్మీ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా ఈమె ఒక నేటిజన్ తనతో మాట్లాడిన విధానం గురించి తెలియజేస్తూ అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఆ నేటిజన్ రష్మి గురించి మాట్లాడుతూ… రష్మీ హైపర్ ఆదితో వైల్డ్ రొమాన్స్ చేస్తోంది… ఇన్ని రోజులు సుదీర్ తో కేవలం రేటింగ్ కోసమే రొమాన్స్ చేశారు కానీ ఆదినీ రష్మీ ఎంతో ఇష్టపడుతోంది అంటూ కామెంట్ చేయడమే కాకుండా ఆమెను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.
ఇలా రష్మీ గురించి ఇలాంటి కామెంట్స్ చేస్తూ తనని ట్యాగ్ చేయడంతో మండిపడిన రష్మీ ఇదివరకు ఈ విధమైనటువంటి వేధింపులను సహించాను ఇకపై ఉపేక్షించేది లేదు పైగా నాకే ట్యాగ్ చేసే అంత ధైర్యం వచ్చింది అంటే ఇక సహించను దీనికి నువ్వు అనుభవిస్తావు అంటూ ఆమె రిప్లై ఇవ్వడంతో వెంటనే భయపడిన నెటిజన్ కాళ్ళ భేరానికి వచ్చి ఏదో పొరపాటున అన్నాను ఇకపై ఇలాంటి తప్పు చేయను ఈసారి క్షమించండి అంటూ బ్రతిమాలాడు.
ఇలా రష్మితో ఇంస్టాగ్రామ్ లో చాట్ చేస్తూ…బుద్ధి తక్కువ అయ్యి ఇలాంటి పని చేశాను నాకు పిల్లలు ఉన్నారు. ఈ ఒక్కసారి క్షమించండి అంటూ వేడుకోగా ఈ క్షమాపణలు సైబర్ క్రైమ్ పోలీసులకు చెప్పుకో అంటూ రష్మీ ఘాటుగా స్పందించారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ లను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇతన పై కంప్లైంట్ ఇవ్వాల వద్ద అని ప్రశ్నించారు. అయితే చాలామంది ఈసారికి వదిలేయండి ఇకపై ఇలాంటి తప్పులు చేయరు అంటూ సలహాలు ఇస్తున్నారు. ఇలా రష్మీ గురించి ఎవరైనా ఇకపై ఇలా మాట్లాడితే కటకటాలు లెక్క పెట్టాల్సిందేనని ఈ సందర్భంగా రష్మీ చెప్పకనే చెప్పేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…