తెలుగు బుల్లితెరపై నెంబర్ 1 యాంకర్ గా కొనసాగుతున్న వారిలో సుమ కనకాల ఒకరు. బుల్లితెరపై ఈమె ప్రస్థానం ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ మొదట్లో యాంకర్ గా కాకుండా టీవీ సీరియల్స్లో నటిస్తూ, ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన తర్వాత యాంకర్ గా మారారు. ఈ క్రమంలోనే తన మాటతీరు, సుమ వేసే పంచ్ డైలాగులు అందరిని ఎంతగానో ఆకట్టుకునేవి ఈ క్రమంలోనే ఈమెకు రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
బుల్లితెరపై ఏ చానల్ పెట్టినా అందులో ఏదో ఒక కార్యక్రమం ద్వారా సుమ మనకు దర్శనమిస్తారు. కేవలం టీవీ కార్యక్రమాలకు మాత్రమే కాకుండా, సినిమా ఫంక్షన్లు, ప్రత్యేకమైన కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో జరిగిన ఆ వేదికపై తప్పనిసరిగా సుమ ఉండాల్సిందే. ఈ క్రమంలోనే కొన్ని గంటల ఫ్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్ లలో పాల్గొనే సుమా లక్షలలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది.
కేవలం బుల్లితెర యాంకర్ గా మాత్రమే కాకుండా పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించడమే కాకుండా, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాని ద్వారా ప్రేక్షకులను మరింత సందడి చేస్తున్నారు. ఈ విధంగా బుల్లితెరపై ఎక్కడ చూసినా కనిపించే సుమ తాజాగా ఓనమ్ పండుగలో తనకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిని తన అభిమానులకు పరిచయం చేశారు. ఓనం పండుగ సందర్భంగా ఎంతో ప్రత్యేకంగా తయారైన సుమ తన చెల్లి అంటూ తన అభిమానులకు ఒక వ్యక్తిని పరిచయం చేశారు.
ఈ క్రమంలోనే సుమా మా చెల్లి అంటూ పరిచయం చేసిన అమ్మాయి నిజానికి తన చెల్లి కాదని, సుమ మామయ్య కూతురని తెలియజేశారు. చిన్నప్పటి నుంచి సుమ తన మామయ్య కూతురు ఇద్దరు కలిసి ఎంతో ఆప్యాయంగా పెరిగానని ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి సుమ తెలియజేశారు. ఈ క్రమంలోనే తన చెల్లి అంటూ పరిచయం చేసిన ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…