Categories: FeaturedMovie News

షాకింగ్… డాక్టర్ బాబుకు మోనితకు లింక్ ఉంది.. అందుకే చేయి స్పర్శతోనే మోనితను కనుకున్న కార్తీక్!

బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో మోనిత దీప ని చంపడానికి చేస్తున్న ప్రయత్నాలు బాగా ఆసక్తిగా మారాయి. పైగా అభిమానులు కూడా దీప ప్రాణాలు ఎలా కాపాడుకుంటుందో అని ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మోనిత కనిపించిందని దీప ఎంత చెప్పినా ఎవరు వినరు. ఇక తప్పించుకున్న మోనిత ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటుంది. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని, తన చేతికి మట్టి అంటకుండా కార్తీక్ ని సొంతం చేసుకోవాలి అనుకుంటుంది.

పిల్లల దగ్గరికి సౌందర్య వచ్చి ఏం జరిగింది అని ప్రశ్నించగా.. సౌర్య మా నాన్న ను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు వస్తాడా రాడా అంటూ పెద్ద పెద్ద మాటలతో ప్రశ్నలు వేస్తుంది.

మరోవైపు దీప మోనితను చూసింది నిజమా కాదా అంటూ ఆలోచనలో పడుతుంది. వెంటనే సౌర్య ఎదురు వచ్చి తన తండ్రి గురించి ప్రశ్నలు వేస్తుంది. తన మాటలతో బాగా విసిగిస్తుంది.

వెంటనే దీప పిల్లలపై అరుస్తుంది. కోపంతో రగిలిపోతుంది. నా చావు నేను చస్తే మీరేంటి ఇలా చేస్తున్నారు అని అరుస్తుంది. అయినా కూడా సౌర్య తన మాటలను అదుపులో ఉంచుకోకుండా మాట్లాడుతూనే ఉంటుంది.

తన తండ్రి గురించి ఎమోషనల్ గా మాట్లాడుతుంది.ఇక తన తల్లిపై అరుస్తారు. మా నాన్న ను చూపించదు అంటూ, సరిగ్గా మాట్లాడదు అంటూ పిల్లల ఇద్దరు బాధపడతారు. పిల్లల మాటలకు మాత్రం ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడే లేక పోతారు.

ఇక సౌర్య ఇక్కడి నుంచి వెళ్లిపోదాం రా అంటూ హిమను లాక్కుంటూ ఏడుస్తూ తీసుకెళుతుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు. పిల్లల మాటలు విన్న దీప కింద పడి ఏడుస్తుంది. ఇక పక్కనే ఉన్న సౌందర్య వచ్చి ఓదారుస్తుంది.

ఇక మోనిత ఆలోచనలో పడుతుంది. దీప ని ఎలా చంపాలో అని తెగ ప్లాన్లు చేసుకుంటుంది. ప్లాన్ ఏ ఫెయిలవడంతో ప్లాన్ బి ను సిద్ధం చేసుకుంటుంది. తనకు ప్లాన్ రావడంతో అద్భుతమైన ప్లాన్ వచ్చిందని.. ఇకపై కార్తీక్, తను హాయిగా బతకొచ్చు అని అనుకుంటుంది.

తన ప్లాన్ ను రత్నసీతకు చెప్పాలనుకుంటుంది. వెంటనే ఫోన్ చేస్తుంది. ఫోన్ లో తన ప్లాన్ మొత్తం చెబుతుంది. అదన్నమాట అని రత్న సీతతో అనేసరికి రిస్క్ ఏమో అంటుంది రత్న సీత. ఇదంతా కార్తీక్ కోసం చేస్తున్నా అని అంటుంది.

గోడ పై రాసుకున్న కార్తీక్ పేరును, కార్తీక్ ఫోటోను చూస్తూ తెగ ముద్దుగా మాట్లాడుకుంటుంది. ఐ లవ్ యు రా అంటూ ఫోటోను హత్తుకుంటుంది. తను ఏం చేసినా మనిద్దరి కోసమే అంటూ మాట్లాడుకుంటుంది.

ఇక పోలీస్ స్టేషన్లో కార్తీక్ ను చూసి రత్న సీత మోనిత మాటలు గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ ను పిలవగా తన భర్త గురించి అడుగుతాడు కార్తీక్. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని పరామర్శిస్తాడు. కార్తీక్ గొప్పదనం చూసి మోనిత ఇలా చేస్తుందని అనుకుంటుంది.

కాసేపట్లో ఇంటరాగేషన్ జరుగుతుంది అని.. ఈసారి చాలా సీరియస్ గా ఉంటుంది అని చెబుతుంది. అంతేకాకుండా లాఠీలతో కొడతారు అన్నట్లు చెప్పగా.. రత్న సీత మాత్రం బాధపడుతుంది.మీరు తప్పు చేయలేదు సార్ అనుకుంటూ లోలోపల కుమిలిపోతుంది.

ఇవాళ కొత్త అమ్మాయి మీకు టీ తీసుకొస్తుందని మూగ అమ్మాయి అని చెబుతుంది రత్న సీత. ఆ మూగ అమ్మాయి ఎవరో కాదు మోనిత అనే ఊహించుకోవచ్చు. ఇక భాగ్యం రోషిణి దగ్గరికి వెళ్లి నా అల్లుడిని విడిపించండి అంటూ కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది.

దీప మాత్రం ఆలోచనల్లో మునిగి పోయింది. ఇక దీపను చూసి ఆనందరావు.. ఒంటరిగా కూర్చుని ఏంటమ్మ అని ప్రశ్నిస్తాడు. భయంగా ఉంది అంటూ ఆనందరావు తో మాట్లాడుతుంది. నీ నమ్మకం వాడిని కాపాడుతుంది అంటాడు ఆనంద్ రావు.

పోలీస్ స్టేషన్ లో డాక్టర్ బాబు ఏం చేస్తారో అని బాధపడుతుంది. రోషిణి మనసు కరిగేది కాదు అని అంటుంది. ఇక తరువాయి భాగంలో మోనిత కనిపించిన విషయాన్ని కార్తీక్ తో చెబుతుంది. మోనిత ముసుగు వేసుకొని టీ ఇవ్వడంతో ఆ స్పర్శని చూసి మోనిత అని అనుకుంటాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago