నటుడు ప్రకాశ్ రాజ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇదేంటి ప్రకాష్ రాజ్ ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకున్నాడు మళ్ళి పెళ్లి అంటే మూడో పెళ్లి అనుకుంటున్నారేమో.. కాదండి బాబూ.. ఈ పెళ్లి ఉత్తుత్తి పెళ్లి మాత్రమే.. అసలు విషయం ఏమిటంటే.. ప్రకాశ్ రాజ్ కుమారుడు వేదాంత్ వీరిద్దరి పెళ్లి చూడాలని కోరుకున్నాడట. అందుకోసం కొడుకు కోరిక మేరకు కొడుకు ముందే మళ్ళీ పెళ్లి చేసుకునట్టు ప్రకాశ్ రాజ్ తాజా ట్వీట్ ద్వారా వెల్లడించారు.
ఈ నేపద్యంలో ప్రకాశ్ రాజ్ భర పోనీ వర్మ, తన పిల్లలతో కలిసి దిగిన ఫొటోలతో సోషల్ మీడియాలో అయన అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాతుతూ.. మా ఇద్దరి పెళ్ళికి వేదాంత్ సాక్షిగా ఉండాలని అనుకున్నాడు. అందుకోసమే ఈ రాత్రి మేమిద్దరో మరోసారి పెళ్లి చేసుకున్నాం అంటూ.. కామెంట్ చేసారు ప్రకాశ్ రాజ్.
అయితే ఇదివరకే ప్రకాశ్ రాజ్ మొదటి భార్య లలిత కుమారికి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఆ తరువాత 2010లో కొరియోగ్రాఫర్ పోనీవర్మని ప్రకాశ్ రాజ్ వివాహం చేసుకున్నారు. ఇక ఇటీవల ప్రకాశ్ రాజ్ చేతికి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కె.జి.యఫ్ చాప్టర్ 2, పుష్ప చిత్రాలతో పాటు రజినీకాంత్ అన్నాత్తే చిత్రాలతో ప్రకాశ్ రాజ్ బిజీగా ఉన్నారు..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…