Categories: FeaturedMovie News

Anchor Shyamala: యాంకర్ శ్యామల ఇంటిని చూశారా.. అచ్చం ఇంద్రభవనాన్ని తలపిస్తుందిగా?

Anchor Shyamala: ప్రస్తుత కాలంలో సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు హోమ్ టూర్ వీడియోల ద్వారా పెద్ద ఎత్తున తమ ఇంటిని ఈ వీడియో రూపంలో చిత్రీకరించి వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు వీడియోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

తాజాగా యాంకర్ శ్యామల సైతం తన హోమ్ టూర్ వీడియో చేశారు. ఈమె గత ఏడాది కార్తీక మాసంలో కొత్త ఇంటి గృహప్రవేశం చేశారు. అయితే గృహప్రవేశానికి సంబంధించిన వీడియోని అభిమానులతో పంచుకున్నారు. తాజాగా తన హోమ్ టూర్ వీడియో ద్వారా మరోసారి అభిమానుల ముందుకు వచ్చారు. ఇక ఇన్ని రోజులపాటు తన హోమ్ టూర్ ఎందుకు చేయలేదో కూడా ఈమె తెలియజేశారు.తనకు కార్తీక మాసంలోనే ఇంట్లోకి చేరాలన్న ఉద్దేశంతోనే ఇంట్లో ఇంకా కాస్త పనులు ఉన్నప్పటికీ తను గృహప్రవేశం చేశానని తెలిపారు.

ఇలా పనులు పూర్తికాకుండానే గృహప్రవేశం చేయటం వల్ల వీడియో చేయలేకపోయానని అయితే ప్రస్తుతం ఇంట్లో ఫర్నిచర్ తో సహా అన్ని సమకూర్చుకున్నానని అందుకే ఇప్పుడు తన హోమ్ టూర్ వీడియో చేస్తున్నానని చెప్పుకొచ్చారు.ఇక తాను తన భర్త పల్లెటూరు నుంచి వచ్చామని అందుకే అలాంటి థీమ్ తోనే ఇల్లు కట్టుకున్నామని తెలిపారు. మొత్తం పాలరాతితో ఎంతో అద్భుతంగా ఇంద్ర భవనాన్ని తలపించేలా శ్యామల ఇల్లు ఉందని చెప్పాలి.

అన్ని సౌకర్యాలతో ఉన్న ఇల్లు…

ఇక ఈ ఇంటిలో రెండు హాల్స్ 4 బెడ్ రూమ్లు అలాగే కిచెన్ దేవుడి గది అన్నింటిని శ్యామల చూపించారు.ఇక తన కుమారుడు కోసం ప్రత్యేకంగా స్పైడర్ మాన్ థీమ్ తో తన బెడ్ రూమ్ తయారు చేయించారు. ఇక ఇంటిలో శ్యామల లిఫ్టు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఓపెన్‌ వార్డ్‌ రోబ్‌, రీడింగ్‌ ప్లేస్‌, మాస్టర్‌ బెడ్‌రూమ్‌ను చూపించింది. అన్ని సౌకర్యాలతో ఎంతో అద్భుతంగా తన సొంత ఇంటి కలను శ్యామల నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago