Featured

Macharla niyojakavargam : నితిన్ డైరెక్టర్ కు ఆ రెండు కులాల సెగ.. ఫేక్ ట్వీట్ అంటూ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్…!

Macherla niyojakavargam : రాజకీయాల్లో కుల సమీకరణ ఉంటుంది, అన్ని కులాల వాళ్ళను ఆకట్టుకోడానికి నాయకులు ప్రయత్నిస్తారు. ఇది రాజకీయాల వరకే పరిమితం. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కులగజ్జి కొంచెం ఎక్కువ, అది సినిమాల్లో కూడా ఉంది. అయితే కొంతమంది వ్యక్తులు ఇతరులను ఇరికించడానికి ఫేక్ అకౌంట్స్ తో సోషల్ మీడియాలో కులాలను రెచ్చగొడుతూ, లేదా ఇతర కులాలను కించపరుస్తూ పోస్ట్లు పెట్టి సదరు వ్యక్తి కి డామేజ్ చేస్తారు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం దర్శకుడి పరిస్థితి అదే.

ఫేక్ అకౌంట్ నుండి పెట్టిన పోస్ట్…

మాచర్ల నియోజకవర్గం సినిమా దర్శకుడు ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి ట్వీటర్ ఖాతా నుండి 2019 ఎన్నికల ఫలితాల తరువాత వెలువడిన పోస్ట్ అంటూ ఒక పాత ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అందులో ఆంధ్రప్రదేశ్ లోని రెండు కులాలను కించపరుస్తూ వాఖ్యలు ఉన్నాయి. అయితే ఆ అకౌంట్ తనది కాదని ఎవరో ఫేక్ అకౌంట ద్వారా ఇలా పోస్ట్ పెట్టారని రాజశేఖర్ రెడ్డి క్లారిటీ ఇస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నేను స్వతహాగా దివంగత రాజశేఖర్ రెడ్డి అభిమానిని ఎన్నికల తరువాత అభిమానతో ట్వీట్ చేసాను కానీ ఇతర కులాలను కించపరుస్తూ ఎవరి మనోభావాలు దెబ్బతినేలా ట్వీట్ చేయలేదు. ఎవరో కావాలని నన్ను ఇరికించాలని ఇలా ఫేక్ ట్వీట్ చేసారు. అయినా నేను ఈ పోస్ట్ డిలీట్ చేయను అంటూ దాని రీ ట్వీట్ చేసారు.

తప్పు చేయలేదు నేను భయపడను అన్నట్లుగా రీ ట్వీట్ చేసారు రాజశేఖర్ రెడ్డి. ఇక ఈ విషయంలో దర్శకుడికి అండగా హీరో నితిన్ నిలిచాడు. ఆ ఫేక్ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ ఒక ఫేక్ పర్సన్‌ చేసిన ఫేక్‌ ట్వీట్‌ అనవసరపు చర్చకు తెర లేపింది. ఇది కొందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండటం విచారకరం. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నేను ఖండిస్తున్నాను. అంటూ ట్వీట్ చేసారు. ఇక నితిన్ అభిమానులు కూడా ఈ ట్వీట్ ఫేక్ అని తెల్చేశారు. అకౌంట్ నేమ్ స్పెలింగ్ సేమ్ లేవని, అదికాక ఇంటి పేరు తరువాత గ్యాప్ లో తేడాలున్నాయని కాబట్టి ఇది ఎవరో కావాలని చేసిన పని అంటూ తెల్చేశారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago