Anchor Shyamala: ప్రస్తుత కాలంలో సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు హోమ్ టూర్ వీడియోల ద్వారా పెద్ద ఎత్తున తమ ఇంటిని ఈ వీడియో రూపంలో చిత్రీకరించి వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు వీడియోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

తాజాగా యాంకర్ శ్యామల సైతం తన హోమ్ టూర్ వీడియో చేశారు. ఈమె గత ఏడాది కార్తీక మాసంలో కొత్త ఇంటి గృహప్రవేశం చేశారు. అయితే గృహప్రవేశానికి సంబంధించిన వీడియోని అభిమానులతో పంచుకున్నారు. తాజాగా తన హోమ్ టూర్ వీడియో ద్వారా మరోసారి అభిమానుల ముందుకు వచ్చారు. ఇక ఇన్ని రోజులపాటు తన హోమ్ టూర్ ఎందుకు చేయలేదో కూడా ఈమె తెలియజేశారు.తనకు కార్తీక మాసంలోనే ఇంట్లోకి చేరాలన్న ఉద్దేశంతోనే ఇంట్లో ఇంకా కాస్త పనులు ఉన్నప్పటికీ తను గృహప్రవేశం చేశానని తెలిపారు.

ఇలా పనులు పూర్తికాకుండానే గృహప్రవేశం చేయటం వల్ల వీడియో చేయలేకపోయానని అయితే ప్రస్తుతం ఇంట్లో ఫర్నిచర్ తో సహా అన్ని సమకూర్చుకున్నానని అందుకే ఇప్పుడు తన హోమ్ టూర్ వీడియో చేస్తున్నానని చెప్పుకొచ్చారు.ఇక తాను తన భర్త పల్లెటూరు నుంచి వచ్చామని అందుకే అలాంటి థీమ్ తోనే ఇల్లు కట్టుకున్నామని తెలిపారు. మొత్తం పాలరాతితో ఎంతో అద్భుతంగా ఇంద్ర భవనాన్ని తలపించేలా శ్యామల ఇల్లు ఉందని చెప్పాలి.

అన్ని సౌకర్యాలతో ఉన్న ఇల్లు…
ఇక ఈ ఇంటిలో రెండు హాల్స్ 4 బెడ్ రూమ్లు అలాగే కిచెన్ దేవుడి గది అన్నింటిని శ్యామల చూపించారు.ఇక తన కుమారుడు కోసం ప్రత్యేకంగా స్పైడర్ మాన్ థీమ్ తో తన బెడ్ రూమ్ తయారు చేయించారు. ఇక ఇంటిలో శ్యామల లిఫ్టు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఓపెన్ వార్డ్ రోబ్, రీడింగ్ ప్లేస్, మాస్టర్ బెడ్‌రూమ్‌ను చూపించింది. అన్ని సౌకర్యాలతో ఎంతో అద్భుతంగా తన సొంత ఇంటి కలను శ్యామల నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.































