బిగ్‌బాస్ 5 తెలుగు రియాలిటీ షో ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. బుధవారం 102వ ఎపిసోడ్ పూర్తయింది. బిగ్‌బాస్ ఫినాలేకు ఇంకా కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హౌస్‌లో కేవలం ఐదురుగు మాత్రమే ఉన్నారు. సిరి, షణ్ముఖ్, మానస్, సన్నీ, శ్రీరాచంద్రలో ఒకరు ఈసారి టైటిల్‌ను కొట్టేందుకు సిద్ధమయ్యారు.
ఇక ఈ షో ముగింపు దశకు చేరకున్నా కొద్ది.. బయటకు వచ్చిన కంటెస్టెంట్లతో పాటు.. హౌజ్ లో ఉన్న వాళ్లను కూడ కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. నెట్టింట్లో వీళ్లకు సంబంధించిన మీమ్స్, ట్రోలింగ్ తో ఆడేసుకుంటున్నారు. అందులో కొంతమంది డబ్బులు తీసుకొని మరీ.. పని కట్టుకొని చేస్తున్నారు. కావాలనే నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారు. కంటెస్టెంట్లను మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టలేదు.
అలా మొత్తానికి ఈ బిగ్ బాస్ ఐదో సీజన్‌లో జరిగిన ట్రోలింగ్, చేసిన నెగెటివ్ ప్రచారాలపై యాంకర్ రవి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అటువంటి ట్రోలింగ్ లకు, నెగెటివ్ కామెంట్ల ముగింపుకు ఇదే మొదలు అని సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేశాడు రవి. తనమీద.. తన ఫ్యామిలీ మీద ట్రోలింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు రవి. ఎవరినైనా సరే ఇలా పరుష పదజాలంతో సోషల్ మీడియాతో దూషిస్తే సహించేది లేదని ఇకపై ఇలాంటివి రిపీట్ అవ్వొద్దనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని యాంకర్ తెలిపాడు.
రవి తీసుకున్న నిర్ణయంపై చాలామంది ప్రశంసిస్తున్నారు. యానీ మాస్టార్ అయితే.. యాంకర్ రవిని మంచి పని చేశావ్ తమ్ముడు అంటూ ప్రశంసించింది. తాను ఎంత జెన్యూన్ గా ఉన్నానో నీకు తెలుసు స్టార్ మా.. ఇక చేసిందంతా చాలు.. ఆపేయండి అంటూ ఫైర్ అయ్యారు మాస్టార్. ఇలాంటి బ్యాడ్ కామెంట్లు.. నెగెటివ్ ట్రోలింగ్ లు చేసేవారిపై తాను కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. హౌస్ లో 24 గంటలు సమయం ఉంటుంది.. అన్ని గంటలు ఏం జరుగుతుందో మీకు తెలియదు.. కేవలం ఒక గంట మాత్రమే చూసి.. తుది నిర్ణయానికి రావొద్దు.. ఇకనైనా ఇవన్నీ ఆపండి అంటూ హెచ్చరించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…