బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్17న ఈ చిత్రం విడుదల కానుండటంతో మూవీ టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతున్న నేపథ్యంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు ప్రమోషన్లో భాగంగా వెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఫుల్ గా పెరిగిపోయింది.
ఒకప్పుడు సెలబ్రిటీలను చూడాలన్నా.. కలవాలన్నా.. ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కానీ.. ప్రస్తుతం అలా లేదు. ఏ చిన్న అప్ డేట్ వచ్చినా.. తమ అభిమానులతో సెలబ్రిటీలు పంచుకుంటున్నారు. ఈ విషయంలో కొన్ని సార్లు సెలబ్రిటీలకు తలనొప్పులు తప్పడం లేదు. వారు షేర్ చేసే ఫోటోలు.. వీడియోలపై నెగిటివ్ కామెంట్లు చేయడంతో అది వారికి రుచించడం లేదు.
ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఇటీవల రాజ్‌పుత్‌కి సంబంధించిన ఓ వీడియోపై పాయల్ రాజ్‌పుత్‌ను ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప హీరోయిన రష్మికాను ఓ నెటిజన్ ట్రోల్ చేశాడు . ఏం జరిగిందటే.. రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సామీ సామీ సాంగ్ కోసం ఎంతో కష్టపడ్డా. అది చూశాక అందరూ నన్ను ప్రశంసిస్తే చాలు. డైరెక్టర్స్ ఏం చెబితే అదే నేను చేస్తా’ అంటూ మాట్లాడిన వీడియోను రష్మిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. అసలు దీన్ని హీరోయిన్‌గా తీసుకోకుండా ఉండాల్సింది. ఇది..దీని ఓవర్ యాక్టింగ్ అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసిన రష్మిక.. ”యాక్టింగో, ఓవరాక్టింగో.. నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాను. నువ్వు ఏం సాధించావు నాన్నా” అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…