బిగ్ బాస్ తెలుగు 5 విజేత ఎవరు అవుతారని తెలుసుకోవడానికి బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 19, 2021న జరుగుతుంది. అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం.. గ్రాండ్ ఫినాలే ఈవెంట్ రేపటి నుంచి (డిసెంబర్ 17) నుంచి మొదలవుతుందని.. రెండు రోజుల్లో పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్.
అయితే హౌజ్ లో షణ్ముఖ్, సిరి, శ్రీ రామచంద్ర, మానస్, సిరిలు టైటిల్ విన్నర్ కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ తెలుగు 5 ముగింపు ఎపిసోడ్‌కు ముఖ్య అతిధులుగా వచ్చే సెలబ్రిటీలు ఎవరనేది పక్కా సమాచారం తెలియదు.
కానీ రామ్ చరణ్-ఆలియా భట్ మరియు దీపికా-రణ్‌వీర్ సింగ్ పాల్గొంటారని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. గత రెండేళ్లుగా బిగ్ బాస్ తెలుగు ఫైనల్ ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్‌ని వీక్షకులకు డబుల్ స్పెషల్‌గా మార్చేందుకు షో నిర్వాహకులు అతిథి జాబితాను మార్చినట్లు తెలుస్తోంది.
విన్నర్ ఎవరు అవుతారనే విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో అన్ అఫీషియల్ పోలింగ్ ప్రకారం..వీజే సన్నీకి మునుపెన్నడూ లేని విధంగా విపరీతంగా ఓట్లు వేస్తున్నారు. దాదాపుగా 50శాతం మించి అతడికి ఓటింగ్ అనేది జరుగుతోంది. దీంతో విన్నర్ సన్నీనే అని బయట ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. ఇక రన్నర్ విషయంలో కాస్త సమీకరణాలు మారుతున్నట్లు అనిపిస్తోంది. దీనిలో షణ్ముఖ్, శ్రీరామచంద్ర పోటీ పడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…