నట సింహం నందమూరి బాలయ్య నటించిన సినిమా ‘అఖండ’.. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాలయ్య దెబ్బకు థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన ‘అఖండ’ అఖండమైన విజయం సాధించింది. ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి.
ఇందులో మరో విషయం ఏంటంటే.. చాలాకాలం తర్వాత ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ కు మంచి ఉత్సాహం ఇచ్చిదనే చెప్పాలి. ఇక ఇదే మూడ్ లో బాలయ్య తన రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాడు. ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న రియాల్టీ షో అన్ స్టాపబుల్ లో మస్తు ఖుషీగా కనిపిస్తున్నాడు. ఈ షోలో స్టార్స్ ను ఇంటర్వ్యూలకు రప్పించి.. కామెడీతో పాటు.. ఎన్నో రకాలు సినీ విశేషాలతో పాటు.. మరెన్నో రకాల అనుభూతులను ప్రేక్షకులకు పంచడంతో బాలయ్య విజయం సాధించాడనే చెప్పాలి.
తాజాగా ఈ షోకు సంబంధించి ప్రోమో విడుదల చేశారు. అందులో బాలయ్యకు ఎదురుగా జక్కన్న కూర్చున్నాడు.అభిమానులు అందరూ మీతో సినిమా ఎప్పుడు అని అడుగుతున్నారు నాతో సినిమా ఎప్పుడు చేస్తావు జక్కన్న అని అడిగారు. అలాగే ‘మీరు ఆల్రెడీ ఇంటెలిజెంట్ అని అఛీవర్ అని అందరికీ తెలుసు. మరి ఇంకా ఎందుకు ఈ తెల్ల గెడ్డం?’అంటూ ప్రశ్నిచాడు బలయ్య.. దానికి రాజమౌళి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు..
మీతో సినిమా చేస్తే హీరోకి ఇండస్ట్రీకి హిట్ ఇస్తారట.. ఆ తర్వాత వాళ్ళ నెక్స్ట్ రెండు, మూడు సినిమాలు ఫసకేగా?’… అంటూ బాలయ్య ప్రశిస్తున్నప్పుడు.. రాజమౌళి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.. కామ్ గా ఉన్నవేంటి రాజమౌళి సమాధానం చెప్పు అనగానే.. ఇది ప్రోమో అనే విషయం మీకు తెలుసు.. నాకు తెలుసు.. ఎసిసోడ్ లో అన్నీ చెబుతాలే అంటూ.. నవ్వుకుంటూ సమాధానం ఇస్తాడు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…