సమంత తన కెరీర్‌లో తొలిసారి ఐటెం సాంగ్ పుష్ప కోసం చేసిది. ఇప్పటి వరకు ఐటెం సాంగ్ లో సమంత కనిపించలేదు. పుష్పలోని స్పెషల్ నంబర్ ‘ఊ అంటావా .. ఊ ఊ అంటావా’ పాట కోసం ఏకంగా రూ.1.5 కోట్లు పారితోషికం అందుకున్న విషయం తెలిసిందే.
దీనికి సంబంధించి గ్లింప్స్ మరియు 30 సెకన్ల నిడివి గల సాంగ్ ను కూడా యూట్యూబ్ లో విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ పాటకు విపరీతంగా వ్యూస్ వస్తున్నాయి. దీంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సమంత ఐటెం సాంగ్ సినిమాకు పెద్ద హైలెట్ గా నిలుస్తుందనేది మూవీ చిత్ర బృందం చెబుతున్నారు.
ఇక ఈ పాట పిక్చరైజేషన్ , మేకింగ్ ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉందట. తెలిసిన సమాచారం ప్రకారం ఈ పాట కోసమే దాదాపు రూ.5 కోట్ల వరకు ఖర్చు పెట్టారట. ఈ సాంగ్ కు పెట్టిన ఖర్చుతో ఓ చిన్న సినిమా రూపొందించవచ్చనేది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన సెట్‌లో ఈ పాట మొత్తాన్ని చిత్రీకరించారు. డిసెంబర్ 17న 5 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప.. ది రైజ్‌లో ఈ పాట ప్రత్యేకంగా నిలుస్తుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం సామ్ ఒక్కో సినిమాకు దాదాపు రూ. 3 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా సినిమాలో స్పేషల్ క్యారెక్టర్ లేదా ఐటెం సాంగ్ లాంటివి చేయాలంటే మాత్రం రూ.3 కోట్లలో సంగం వరకు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆమె అడిగిన దానికి ఇవ్వడానికి నిర్మాతలు కూడా వెనకడుగు వెయ్యకపోవడం విశేషం. ఇక ఇప్పటికే ఆకట్టుకున్న పుష్ప సినిమా ట్రైలర్ ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తూ అంచనాలను భారీగా పెంచేసింది.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…