Anil Ravipudi: పటాస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.ఈయన ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవ్వడమే కాకుండా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.ఇలా దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
తాజాగా f3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన మరొక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం అనిల్ రావిపూడి బాలకృష్ణతో సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులను ప్రారంభం చేసుకోనుంది. అందుకే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో అనిల్ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ తాను ఎక్కువగా కామెడీ జోనర్ లోనే సినిమాలు చేస్తానని తెలిపారు. మొదటిసారి బాలయ్య కోసం సరికొత్త జోనర్ లో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.ఇకపోతే తాను ఇండస్ట్రీలో ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని సాధించాయి. అయితే కొందరు మాత్రం నేను చేసిన సినిమాల వల్ల నిర్మాతలు బయ్యర్లు నష్టపోయారంటూ వార్తలు సృష్టించారు.ఇలా నన్ను కావాలనే ఉద్దేశపూర్వకంగా కొందరు టార్గెట్ చేస్తూ ఇలాంటి వార్తలను పుట్టించారంటూ ఈయన ఆరోపణలు చేశారు.
ఎవరు నష్టపోలేదు…
ఇండస్ట్రీలో తన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ కావడంతో కొందరు అసూయతో నాపై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని, అయితే ఇప్పటివరకు తాను చేసిన సినిమాలను కొన్న బయ్యర్లు నిర్మాతలు నష్టపోలేదని వారందరూ కూడా మంచి లాభాలనే అందుకున్నారని ఈ సందర్భంగా ఈయన తన గురించి ఇండస్ట్రీలో జరుగుతున్న కుట్రపట్ల చేసినటువంటి కామెంట్స్ వైరల్ కావడంతో అనిల్ గురించి ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనే విషయంపై చర్చలు మొదలయ్యాయి.
కోర్టు ఆదేశాలతో ‘మెగా’ నిర్ణయం తెలుగు చలనచిత్ర పరిశ్రమ (TFI) చరిత్రలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. సినిమాలపై సోషల్ మీడియాలో…
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…