Anitha Chowdary : మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ హీరోస్ లో నందమూరి బాలకృష్ణ కు ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీ ఉంది. ఇక అందరి హీరోస్ ది ఒకదారి అయితే బాలకృష్ణ నడిచే దారి మాత్రం చాలా సెపరేట్ అనే చెప్పాలి. ఇక బాలయ్య మనస్తత్వం చిన్న పిల్లల మనస్తత్వం, సినిమాల్లో వచ్చే పాత్రలును బట్టి బాలయ్య పెర్ఫామెన్స్ హై వోల్టేజ్ లో ఉంటుంది కానీ, అదే కనుక బయట చూస్తే బాలయ్య చాలా కూల్ గా ఉంటారు. ఇక బాలయ్య కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, బసవతారకం క్యాన్సర్ హాస్పెటల్ ఛైర్మన్ గా పేద ప్రజలు ఎన్నో సేవలు అందిస్తున్నారు. సినిమాల్లో ఉన్నట్లు బయట ఉండరు ఎవ్వరు, అలానే బాలకృష్ణ తో దగ్గరగా ట్రావెల్ చేసినప్పుడు బాలయ్య ఎలాంటి వాడు అనే విషయం అనేది అర్థమౌతుంది అని డైరెక్టర్ పూరి జగన్నాథ్, డైరెక్టర్ బోయపాటి శ్రీను పలు సందర్భాల్లో తెలిపారు.
ఇక అసలు విషయానికి వస్తే, ఒకప్పుడు టెలివిజన్ ఛానెల్స్ లో యాంకర్ గా రాణించిన అనితా చౌదరి గురించి మనకందరికీ తెలిసిన విషయమే. ఇక అనితా టెలివిజన్ ఛానెల్స్ లో వ్యాఖ్యాత గా బాగా రాణిస్తున్న సమయంలోనే సీరియల్స్ లోకూడా అవకాశాలు రావడం జరిగింది. సీరియల్స్ చేస్తున్న సమయంలోనే సినిమాలో అవకాశాలు వచ్చాయి, రాజా, మురారి, నువ్వే -నువ్వే, ఉయ్యాల జంపాల, గురు, నిర్మలా కాన్వెంట్, మెంటల్ మదిలో, ఛత్రపతి, మన్మధుడు, వంటి సినిమాల్లో అనిత యాక్టింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇక అనితా వ్యక్తిగత విషయానికి వస్తే తన లైఫ్ లో మేజర్ యాక్సిడెంట్స్ జరిగాయి. కేరింత సినిమా సమయంలోనే మరో యాక్సిడెంట్ అయింది. ఇక ఆ యాక్సిడెంట్ అనితాకు చాలా ఎఫెక్ట్ ఇచ్చింది. ఆ యాక్సిడెంట్ లో డిస్క్ విరగడం జరిగింది, ఆ సమయంలోనే ఇక నేను ఇక్కడ ఉండను నేను అమెరికా వెళ్లి చికిత్స చేయించుకుందాం అని అనుకున్నాను, కానీ నాకొక అభిమాని ఉంది తను బాలకృష్ణ కు చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి తను నా గురుంచి ఆలోచించి హీరో బాలకృష్ణ కు నా యాక్సిడెంట్ గురుంచి చెప్పడం జరిగింది. ఇక ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ వెంటనే రంగంలోకి దిగడం జరిగింది.
ఇక బాలకృష్ణ కనుక రంగంలోకి దిగితే ఆ పని కచ్చితంగా పూర్తికావలసిందే. తన ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్ ద్వారా అనితా కు జరిగిన యాక్సిడెంట్ కు వెంటనే స్పందించి బాలయ్య హాస్పటల్ కి వచ్చి నటి అనితా కు ధైర్యం చెప్పి తన సర్జరీ విషయం లో చాలా సహ్యాయం చేశారు అని అనితా తెలిపింది. అసలు బాలకృష్ణ గారు నా విషయంలో ఇలా వెంటనే స్పందిస్తారు అని అనుకోలేదు అలానే తన హస్పెటల్ సిబ్బంది తో మాట్లాడి తన భర్త తో కూడా మాట్లాడి ఇంత సహాయం చేస్తారు అని అనుకోలేదు.
ఇక నాకు యాక్సిడెంట్ అయి నా లైఫ్ అయిపోయింది అని చాలామంది నామీద జోక్స్ వేసేవారు, ఆ సమయంలోనే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నా పక్కన ఉన్నారు అప్పుడు కృష్ణవంశీ గారు నువ్వు ఫైటర్ అని అన్నారు ఆ మాటలు నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించాయి . ఇక అలానే నాకు జరిగిన యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు అని అనితా తెలిపింది .. ఇక అనితా డైలీ లైఫ్ విషయానికి వస్తే నేను బేసిక్ గా ఫీజికల్ ఫిట్ గా ఉండటానికి ప్రయత్నిస్తుంటాను, నేను ఉదయం లెగవడం జిమ్ చేసుకోవడం, ఇప్పుడు కొత్తగా స్విమ్మింగ్ చేసుకోవడం మొదలు పెట్టాను. ఇక నా లైఫ్ మీద కామెంట్స్ చేస్తే అది మీ ప్రాబ్లెమ్ నాది కాదు అని తెలిపింది .
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…