Sravana Bhargavi: సింగర్ శ్రావణ భార్గవి గత కొంతకాలం నుంచి తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నారు అనే వివాదంలో చిక్కుకున్నారు. అయితే వీరి విడాకుల గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ విషయంపై స్పందించిన శ్రావణ భార్గవి హేమచంద్ర మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని బయటపెట్టేశారు. ఇక ఈ వివాదం ముగిసిన తర్వాత ఈమె మరొక వివాదంలో చిక్కుకున్నారు.
అన్నమయ్య కీర్తనలను పాడుతూ ఆ పాటలో నటించడం వల్ల పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.ఈ పాటలో శ్రావణ భార్గవి శృంగార భరితంగా కనపడుతూ నటించింది అంటూ పెద్ద ఎత్తున భక్తులు ఈ పాటపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ వీడియోని వైరల్ చేశారు. ఈ వీడియోని టిటిడి అధికారులకు చేరేలా షేర్ చేస్తూ ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇకపోతే ఈ వివాదంపై శ్రావణ భార్గవి స్పందిస్తూ తాను ఈ పాటలో ఏ విధమైనటువంటి అసభ్యకరంగా నటించడం లేదని, తాను అన్నమయ్య కీర్తనలను కించపరిచేలా చేయలేదు అంటూ తన తప్పులేదని సమర్థించుకున్నారు. అయితే ఈ వివాదం పై అన్నమయ్య వంశీకులు స్పందిస్తూ శ్రావణ భార్గవికి వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు.శ్రీహరి పై భక్తితో అన్నమయ్య కీర్తనలను ఎంతో అద్భుతంగా రచించారు అలాంటి కీర్తనలను ఈమె శృంగార భరితంగా చేయడం మమ్మల్ని ఎంతగానో బాధించిందని అన్నమయ్య వంశీకుల పేర్కొన్నారు.
శ్రావణ భార్గవి చేసిన తప్పును తెలుసుకొని తాను వెంటనే ఆ వీడియోని తొలగించకపోతే తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడమని, న్యాయపరంగా ముందుకు వెళ్లి ఆమెకు శిక్ష పడేలా చేస్తామని అన్నమయ్య వంశీకులు హరి నారాయణ చార్యులు శ్రావణ భార్గవికి వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ విషయంపై శ్రావణ భార్గవి వెనక్కు తగ్గి తన ఆల్బమ్ డిలీట్ చేస్తారా లేకపోతే ఈ వివాదాన్ని మరి కాస్త ముందుకు తీసుకెళ్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…