Featured

చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. ఈ వైరస్ బారిన పడి ఒకరి మృతి!

వెటర్నరీ డాక్టర్ చనిపోయిన రెండు కోతులకు పోస్టుమార్టం నిర్వహించిన కొన్నిరోజులకు అతడు తీవ్రమైన వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ఆస్పత్రి పాలయ్యాడు. ఈ క్రమంలోనే అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విధంగా పశు వైద్యుడు మృతిచెందడంతో అతని సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా ఎవరికీ ఈ వైరస్ వ్యాప్తి చెందలేదు.

మంకీ బీ వైరస్‌ను మొట్టమొదటిసారిగా 1932లో కనుగొన్నారని, ఈ వైరస్ కనిపెట్టిన నాటి ఇప్పటివరకు కేవలం యాభై మరణాలు మాత్రమే సంభవించడం విశేషం. అయితే ఈ వైరస్ బారిన పడిన వారు తీవ్రమైన అనారోగ్య సమస్యతో మృతి చెందుతారు. ఈ వైరస్ ను మొట్ట మొదటిసారిగా మకాక్యూ అనే జాతికి చెందిన కోతులలో గుర్తించారు. ఈ వైరస్ వ్యాప్తి చెందినప్పుడు ముందుగా కేంద్ర నాడీ వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

మరొక విషయం ఏమిటంటే ఈ వైరస్ మనిషి నుంచి మరొక మనిషికి వ్యాప్తి చెందక పోవడం ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఈ వైరస్ ఎక్కువగా వెటర్నరీ డిపార్ట్మెంట్ లో పనిచేసే సిబ్బందికి మాత్రమే వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.ఈ వైరస్ బారిన పడితే ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేవని, కేవలం యాంటీవైరల్ మెడిసిన్స్‌తోనే ఈ వైరస్‌కి చికిత్స అందిస్తారని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

భూమిపై మోక్షనగరం కాశీనా? శాస్త్రాలు చెప్పే అద్భుత విశేషాలు..!

భారతదేశంలో ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన నగరాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చేది కాశీ. వేల ఏళ్ల చరిత్ర, అనేక పురాణ…

5 minutes ago

జిమ్ ట్రెండ్‌గా మారిన ప్రోటీన్ సప్లిమెంట్స్… జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమే..!

ఇటీవల కాలంలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి గణనీయంగా పెరిగింది. జిమ్‌లకు వెళ్లేవారు మాత్రమే కాదు, బరువు తగ్గాలని భావించే వారు కూడా…

17 minutes ago

డైజెస్టివ్, ఓట్స్, షుగర్ ఫ్రీ… మోసపోతున్నామా? బిస్కెట్లపై నిపుణుల హెచ్చరిక..

ఉదయం టీతో రెండు బిస్కెట్లు, సాయంత్రం కాఫీకి మరికొన్ని – ఇది చాలామందికి రోజువారీ అలవాటు. పిల్లలకు టిఫిన్ బాక్స్‌లో…

26 minutes ago

ఆధార్ సేవలు ఇక చేతిలోనే.. కొత్త యాప్‌కు దేశవ్యాప్తంగా భారీ ఆదరణ..!

దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త మొబైల్ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన…

35 minutes ago

హైదరాబాద్ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇక బ్యాగుల బారం తగ్గినట్లే!

హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు లక్షలాది మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు – అందరికీ…

44 minutes ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ! నిర్మాతగా గుడ్‌బై… మంచు లక్ష్మి షాకింగ్ నిర్ణయం!

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఘన విజయాలకు ప్రతీకగా నిలిచిన బ్యానర్లలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ…

45 minutes ago