వెటర్నరీ డాక్టర్ చనిపోయిన రెండు కోతులకు పోస్టుమార్టం నిర్వహించిన కొన్నిరోజులకు అతడు తీవ్రమైన వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ఆస్పత్రి పాలయ్యాడు. ఈ క్రమంలోనే అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విధంగా పశు వైద్యుడు మృతిచెందడంతో అతని సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా ఎవరికీ ఈ వైరస్ వ్యాప్తి చెందలేదు.
మంకీ బీ వైరస్‌ను మొట్టమొదటిసారిగా 1932లో కనుగొన్నారని, ఈ వైరస్ కనిపెట్టిన నాటి ఇప్పటివరకు కేవలం యాభై మరణాలు మాత్రమే సంభవించడం విశేషం. అయితే ఈ వైరస్ బారిన పడిన వారు తీవ్రమైన అనారోగ్య సమస్యతో మృతి చెందుతారు. ఈ వైరస్ ను మొట్ట మొదటిసారిగా మకాక్యూ అనే జాతికి చెందిన కోతులలో గుర్తించారు. ఈ వైరస్ వ్యాప్తి చెందినప్పుడు ముందుగా కేంద్ర నాడీ వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
మరొక విషయం ఏమిటంటే ఈ వైరస్ మనిషి నుంచి మరొక మనిషికి వ్యాప్తి చెందక పోవడం ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఈ వైరస్ ఎక్కువగా వెటర్నరీ డిపార్ట్మెంట్ లో పనిచేసే సిబ్బందికి మాత్రమే వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.ఈ వైరస్ బారిన పడితే ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేవని, కేవలం యాంటీవైరల్ మెడిసిన్స్‌తోనే ఈ వైరస్‌కి చికిత్స అందిస్తారని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు.































