Movie News

ఆయన ఎవరికీ రెండో ఛాన్స్ ఇవ్వరు.. ఇది నా అదృష్టం.. అనసూయ!

ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. వెండితెరపై ఈమె నటించిన పలు పాత్రలు ఎంతో మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఈ క్రమంలోనే వెండితెరపై పలు అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు.

తాజాగా అనసూయ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అనసూయ తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో ఇదివరకే తెరకెక్కిన “రంగస్థలం” సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన అనసూయ ప్రస్తుతం “పుష్ప” సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

సినిమా విషయానికి వస్తే ఇందులో తన పాత్ర జీవితాంతం గుర్తుండే విధంగా ఉంటుందని, ఆ పాత్రకు అంత ప్రాధాన్యత ఉందని ఈ సందర్భంగా అనసూయ తెలిపారు. మామూలుగా దర్శకుడు సుకుమార్ ఆర్టిస్టులకు రెండవ ఛాన్స్ ఇవ్వరు. అలాంటిది తన సినిమాలో నాకు రెండో ఛాన్స్ ఇవ్వడం నిజంగా నా అదృష్టం అంటూ అనసూయ తెలిపారు. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక జంటగా సందడి చేయనున్న సంగతి మనకు తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago