బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కేసు రోజుకో సరిక్రొత్త మలుపు తిరుగుతూనే ఉంది. ఈ కేసును దర్యాప్తు చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడంతో CBI కూడా రంగంలోకి దిగిపోయింది. దీంతో ఈ కేసు ఇన్వెస్ట్ గేషన్ లో భాగంగా అధికారుల సుశాంత్ ఇంట్లో పనిచేసిన హౌస్ కీపర్ నీరజ్ సింగ్ ను విచారించారు. ఈ విచారణలో సుశాంత్ గురించి నీరజ్ కొన్ని సంచలనమైన విషయాలను చెప్పినట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఎక్కువగా గంజాయితో నింపిన సిగరెట్లను తాగేవాడని, సుశాంత్ ఇంట్లోనే వారానికి కనీసం 2 సార్లు పార్టీ చేసుకునేవాడని, సుశాంత్ బలవాన్మరణానికి 2 రోజుల ముందు కూడా తాను గంజాయితో నింపిన సిగరెట్ పెట్టెలను తెచ్చి ఇచ్చానని, సుశాంత్ చనిపోయిన తర్వాత చూస్తే ఆ పెట్టెలన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు హౌస్ కీపర్ నీరజ్. ఇదిలా ఉంటే సుశాంత్ బెస్ట్ ఫ్రెండ్, క్రియేటివ్ మేనేజర్ సిద్ధార్థ్ పితానీ కూడా ముంబైలోని CBI బృందం ఉన్న D.R.D.O గెస్ట్‌హౌస్‌కు ఆగస్ట్ 23న ఉదయం వచ్చి కొన్ని వివరాలనందించాడు. అందులో సుశాంత్ వాడిన మొబైల్ కూడా ఈయన పేరు మీదే ఉండటం ఆశ్చర్యకరమైన విషయం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…