సుశాంత్ ఎక్కువగా గంజాయి నింపిన సిగరెట్లను తాగేవాడని క్రొత్త ట్విస్ట్ ఇచ్చిన హౌస్ కీపర్ నీరజ్ !!

0
160

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కేసు రోజుకో సరిక్రొత్త మలుపు తిరుగుతూనే ఉంది. ఈ కేసును దర్యాప్తు చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడంతో CBI కూడా రంగంలోకి దిగిపోయింది. దీంతో ఈ కేసు ఇన్వెస్ట్ గేషన్ లో భాగంగా అధికారుల సుశాంత్ ఇంట్లో పనిచేసిన హౌస్ కీపర్ నీరజ్ సింగ్‌ ను విచారించారు. ఈ విచారణలో సుశాంత్‌ గురించి నీరజ్ కొన్ని సంచలనమైన విషయాలను చెప్పినట్లు తెలిసింది.

వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఎక్కువగా గంజాయితో నింపిన సిగరెట్లను తాగేవాడని, సుశాంత్ ఇంట్లోనే వారానికి కనీసం 2 సార్లు పార్టీ చేసుకునేవాడని, సుశాంత్‌ బలవాన్మరణానికి 2 రోజుల ముందు కూడా తాను గంజాయితో నింపిన సిగరెట్ పెట్టెలను తెచ్చి ఇచ్చానని, సుశాంత్ చనిపోయిన తర్వాత చూస్తే ఆ పెట్టెలన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు హౌస్ కీపర్ నీరజ్. ఇదిలా ఉంటే సుశాంత్ బెస్ట్ ఫ్రెండ్, క్రియేటివ్ మేనేజర్ సిద్ధార్థ్ పితానీ కూడా ముంబైలోని CBI బృందం ఉన్న D.R.D.O గెస్ట్‌హౌస్‌కు ఆగస్ట్ 23న ఉదయం వచ్చి కొన్ని వివరాలనందించాడు. అందులో సుశాంత్ వాడిన మొబైల్ కూడా ఈయన పేరు మీదే ఉండటం ఆశ్చర్యకరమైన విషయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here