Prabhas-Project K: ప్రాజెక్ట్ ‘కె’ నుంచి మరో అప్ డేట్..! విడుదల తేదీ ఖరారు..!
Prabhas-Project K: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె తొలిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. అశ్విన్ దత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రభాస్, దీపిక జంటగా ఇటీవల హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తయింది.
దీంతో పాటు మరో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. మొత్తం రెండు షెడ్యూల్ లను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో అంటే మరో రెండు రోజుల్లో సినిమా షూటింగ్ ని పునఃప్రారంభించనున్నారు. పరిస్థితులు సహకరిస్తే ఈ నెలాఖర్లో కొత్త షెడ్యూల్‌ను ఆరంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత తెలిపాడు.
ఈ సినిమాకు ప్రాజెక్ట్ ‘కె’ అనే టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారో తెలిసిపోయింది.
వచ్చే ఏడాది (2023) వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రాజెక్ట్ కె నిర్మాత అశ్విన్ దత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా.. ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘రాధే శ్యామ్’ ఈ నెల సంక్రాంతి రోజున విడుదల కావాల్సి ఉండగా. కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా కనిపించనున్న విషయం తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…