Allu Arjun: శ్యామ్ సింగరాయ్ టీమ్ కు క్షమాణలు చెప్పిన ఐకాన్ స్టార్.. ఎందుకంటే?
Allu Arjun: గత సంవత్సరం డిసెంబర్లో విడుదలై బంపర్ హిట్ కొట్టిన సినిమాల్లో అఖండ, పుష్ప, శ్యామ్ సంగరాయ్ ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శ్యామ్ సింగరాయ్ కూడా ప్యాన్ ఇండియా లెవల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఇటీవల బన్నీ.. శ్యామ్ సింగరాయ్ సినిమా చూశారు. తర్వాత నానీని అభినందించడం మర్చిపోయా అంటూ.. రౌడీ బాయ్స్ సినిమా సాంగ్ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడారు. శ్యామ్ సింగరాయ్ సినిమా చూశానని.. అద్భుతంగా ఉందని.. కానీ ఆ టీమ్ ను అభినందించడానికి సమయం దొరకలేదని చెప్పుకొచ్చారు.
ఆ విషయాన్ని తాను మర్చిపోయానని చెప్పారు. మంచి ప్రయత్నం చేసిన ఆ టీమ్ కు అభినందనలు తెలియజేశారు. ఇక ఇటీవల హీరో రామ్ చరణ్ కూడా శ్యామ్ సింగరాయ్ సినిమా చూసి.. అభినందించారు. తాజాగా అల్లు అర్జున్ కూడా అభినందించడంతో ఆ టీమ్ ఆనందంలో మునిగితేలింది.
అల్లు అర్జున్ ఆ టీమ్ ను అభినందించే ముందు క్షమాపణలు చెప్పాడు. దానికి గల కారణం ఏంటంటే.. సినిమా బాగుంది తాను చివరి ప్రెస్ మీట్లోనే చెబుదామనుకున్నా.. కానీ మర్చిపోయానని చెబుతూ క్షమించండి అని కోరాడు. నానీ, సాయి పల్లవి యాక్టింగ్ ఎంతో ఆకట్టుకుంది అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక సెకండ్ వేవ్ తర్వాత తెలుగు సినిమాలకు పూర్వ వైభవం వచ్చిందని.. ప్రతీ సినిమా సక్సెస్ కావాలని తాను కోరుకుంటున్నట్లు ఈ ఫంక్షన్లో తెలిపాడు. శ్యామ్ సింగరాయ్ సినిమా టీమ్‌కి అభినందనలు తెలిపిన స్టార్ హీరో అల్లు అర్జున్‌కి చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ధన్యవాదాలు తెలియజేశారు. ట్వీట్టర్ వేదికగా.. అల్లు అర్జున్ మాట్లాడే వీడియోను పోస్టు చేస్తూ ట్వీట్ చేశాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…