Featured

Diabetes Symptoms: ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయా…డయాబెటిస్‌ కావచ్చు!

Diabetes Symptoms:  ఈ రోజుల్లో చిన్నా, పెద్దా భేదం లేకుండా అందరిని ఇబ్బంది పెడుతున్న సమస్య డయాబెటిస్, చక్కెర వ్యాధి లేదా షుగర్ అని అంటారు. ఇది వంశపారంపర్యంగా గాని, మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల కాని వస్తుంది. ఈ సమస్య ఒక సారి వస్తే దీనిని ఆహారపు నియమాలు, ఇతర జాగ్రత్తల వల్ల కంట్రోల్ చేయడమే తప్ప పూర్తిగా నిర్మూలించడం సాధ్యపడదు. డయాబెటిస్ అనేది మన శరీరంలోని చక్కెర స్థాయిలు పెరగడం లేదా తగ్గడం వల్ల గుర్తించవచ్చు.

Diabetes Symptoms: ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయా…డయాబెటిస్‌ కావచ్చు!

ఈ వ్యాధి సంక్రమించడం మొదలవగానే శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. సాధారణం కంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయటం. మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువైతే కిడ్నీలు చక్కెరను సులువుగా ఫిల్టర్ చేయలేవు. దీంతో చక్కెర మూత్రంలో పేరుకుపోయి పదేపదే మూత్రం వస్తుంది. ఇటువంటి లక్షణాలు మీలో గుర్తించినట్ల అయితే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి .ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి కూడా దారి తీయవచ్చు.

Diabetes Symptoms: ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయా…డయాబెటిస్‌ కావచ్చు!

డయాబెటిస్ మీ కంటి చూపు మీద ప్రభావం చూపుతుంది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువైతే కంటి చూపు మందగిస్తుంది. మీ కంటి చూపులో ఆకస్మిక మార్పులు సంభవించినట్లు అయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. అన్నిటికన్నా సులభంగా దీనిని గుర్తించే మార్గం మీ చర్మం మీద మార్పులు. ఇన్సులిన్ లోపం వల్ల మీ చర్మం రంగు మారుతుంది. చర్మం మీద, జాయింట్లలో నల్లగా మచ్చలు వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

అకస్మాత్తుగా బరువు తగ్గడం..

కొంతమందిలో మీ శరీరం శక్తిని ఇవ్వడానికి గ్లూకోజ్ ను సమర్థవంతంగా ఉపయోగించలేదు. అలాంటప్పుడు శరీరంలో ఉన్న కొవ్వు కరిగి తక్షణ బరువు తగ్గిపోతుంటారు. ఇలా అకస్మాత్తుగా బరువు తగ్గితే డాక్టర్ ను సంప్రదించాలి. డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు త్వరగా అలసిపోతుంటారు. మీరు కనుక తగిన విశ్రాంతి, తగిన ఆహారం తీసుకున్నా సరే త్వరగా అలసి పోతున్నట్టు అయితే అది మధుమేహం హెచ్చరికనే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago