Diabetes Symptoms: ఈ రోజుల్లో చిన్నా, పెద్దా భేదం లేకుండా అందరిని ఇబ్బంది పెడుతున్న సమస్య డయాబెటిస్, చక్కెర వ్యాధి లేదా షుగర్ అని అంటారు. ఇది వంశపారంపర్యంగా గాని, మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల కాని వస్తుంది. ఈ సమస్య ఒక సారి వస్తే దీనిని ఆహారపు నియమాలు, ఇతర జాగ్రత్తల వల్ల కంట్రోల్ చేయడమే తప్ప పూర్తిగా నిర్మూలించడం సాధ్యపడదు. డయాబెటిస్ అనేది మన శరీరంలోని చక్కెర స్థాయిలు పెరగడం లేదా తగ్గడం వల్ల గుర్తించవచ్చు.

ఈ వ్యాధి సంక్రమించడం మొదలవగానే శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. సాధారణం కంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయటం. మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువైతే కిడ్నీలు చక్కెరను సులువుగా ఫిల్టర్ చేయలేవు. దీంతో చక్కెర మూత్రంలో పేరుకుపోయి పదేపదే మూత్రం వస్తుంది. ఇటువంటి లక్షణాలు మీలో గుర్తించినట్ల అయితే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి .ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి కూడా దారి తీయవచ్చు.

డయాబెటిస్ మీ కంటి చూపు మీద ప్రభావం చూపుతుంది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువైతే కంటి చూపు మందగిస్తుంది. మీ కంటి చూపులో ఆకస్మిక మార్పులు సంభవించినట్లు అయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. అన్నిటికన్నా సులభంగా దీనిని గుర్తించే మార్గం మీ చర్మం మీద మార్పులు. ఇన్సులిన్ లోపం వల్ల మీ చర్మం రంగు మారుతుంది. చర్మం మీద, జాయింట్లలో నల్లగా మచ్చలు వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
అకస్మాత్తుగా బరువు తగ్గడం..
కొంతమందిలో మీ శరీరం శక్తిని ఇవ్వడానికి గ్లూకోజ్ ను సమర్థవంతంగా ఉపయోగించలేదు. అలాంటప్పుడు శరీరంలో ఉన్న కొవ్వు కరిగి తక్షణ బరువు తగ్గిపోతుంటారు. ఇలా అకస్మాత్తుగా బరువు తగ్గితే డాక్టర్ ను సంప్రదించాలి. డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు త్వరగా అలసిపోతుంటారు. మీరు కనుక తగిన విశ్రాంతి, తగిన ఆహారం తీసుకున్నా సరే త్వరగా అలసి పోతున్నట్టు అయితే అది మధుమేహం హెచ్చరికనే.































