ANR Birth Anniversary: భారతీయ చిత్ర పరిశ్రమలో నటుడు అక్కినేని నాగేశ్వరరావు సినీ ప్రస్థానం గురించి పరిచయం అవసరం లేదు ఎన్నో విభిన్నమైన పాత్రలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన సుమారు 78 సంవత్సరాల పాటు సినీ పరిశ్రమలో కొనసాగి చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు. ఇలా నాగేశ్వరరావు చివరి క్షణం వరకు సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
1941 ధర్మపత్ని అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగేశ్వరరావు చివరిగా మనం సినిమా వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎన్నో అవార్డులు, బిరుదులు సొంతం చేసుకున్నారు.ఇక నేడు నాగేశ్వరరావు జయంతి కావడంతో ఆయన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
ధర్మపత్ని అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగేశ్వరరావు ఎన్నో ప్రేమకథా చిత్రాలను కుటుంబ కథ చిత్రాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈయన నటనకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనని ఎన్నో బిరుదులతో అవార్డులతో సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా ఏఎన్నార్ అందుకున్నారు.
కేవలం ఈ అవార్డు మాత్రమే కాకుండా వరుసగా పద్మ అవార్డులను కూడా అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించి ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మ విభూషణ్’ వంటి మూడు పద్మ పురస్కారాలు పొందిన తొలి నటుడుగా ఈయన పేరు సంపాదించుకున్నారు. అనంతరం ఇలా మూడు పద్మ అవార్డులను పొందిన ఘనత అమితాబచ్చన్ దివంగత బాలు సుబ్రహ్మణ్యం గారికి కూడా చెల్లిందని చెప్పాలి. భారతదేశంలోనే తొలి సారిగా పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న నటుడిగా ఏఎన్నార్ రికార్డు సృష్టించారు. ఈ ఘనత కేవలం ఈయనకు మాత్రమే సొంతమైందని చెప్పాలి.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…