Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు సినీ ప్రస్థానం గురించి మనకు తెలిసింది ఆయన వారసుడిగా నాగార్జున బాలనటుడిగా నటించి అనంతరం విక్రమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నాగార్జున అనంతరం మజ్ను, సంకీర్తన అనే సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకున్నారు.
ఈ క్రమంలోనే సంకీర్తన సినిమా దర్శకుడు గీతాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి ఈ సినిమాలో నాగార్జునను హీరోగా తీసుకోవడం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇక ఈ సినిమా దర్శకుడిగా గీతాకృష్ణకు మొదటి సినిమా. ఈ సినిమాలోగీతాకృష్ణ నాగార్జున ని హీరోగా తీసుకోవడం కోసం కథను నాగేశ్వరరావుకి వినిపించారు.
కథ విన్న నాగేశ్వరరావు చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాలో మా అబ్బాయి నటిస్తారని చెప్పారు.అలా సంకీర్తన సినిమాలో రమ్యకృష్ణ నాగార్జున నటించారని గీత కృష్ణ వెల్లడించారు.ఇకపోతే నాగార్జున నటించిన విక్రమ్ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రెండు మూడు సంవత్సరాల నుంచి మెగాస్టార్ చిరంజీవి డేట్ల కోసం ఎదురుచూస్తూ అతని చుట్టూ తిరుగుతున్నారు.
మెగాస్టార్ డేట్స్ దొరకకపోవడం వల్ల విసుగు చెందిన నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున హీరోగా విక్రమ్ సినిమాని పరిచయం చేశారని ఈ సందర్భంగా గీత కృష్ణ వెల్లడించారు. ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి కోసం ఎదురు చూసి విసిగిపోయిన నాగేశ్వరరావు నాగార్జునను తన బ్యానర్లో హీరోగా ఇంట్రడ్యూస్ చేశారనీ ఆయన వెల్లడించారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…