Anushaka: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అనుష్క శెట్టి ఒకరు. సూపర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె అనంతరం అరుంధతి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో అనుష్క వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎన్నో సక్సెస్ సినిమాలలో నటించిన ఈమె బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు పొందారు.
ఈ సినిమా తర్వాత అనుష్క నిశ్శబ్దం అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలైంది అనే విషయం కూడా ఎవరికీ తెలియనంత డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత దాదాపు మూడు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి అనుష్క త్వరలోనే మిస్ శెట్టి మిస్టర్ పోలీ శెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నవీన్ పోలిశెట్టి హాజరవుతున్నారు.ఇకపోతే ఈ సినిమా కోసం నటి అనుష్క శెట్టి తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా కోసం అనుష్క శెట్టి తన రెమ్యూనరేషన్ డబల్ చేసి తీసుకున్నారనీ తెలుస్తుంది.ఈ సినిమాలో నటించడం కోసం అనుష్క ఏకంగా ఆరు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇలా మూడు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ అనుష్క మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో భారీగానే డిమాండ్ చేస్తున్నారనీ తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…