Bigg Boss: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ రియాల్టీ షో కి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లోని పూర్తిచేసుకుని ఏడవ సీజన్ ప్రసారమవుతుంది. అయితే ఈ సీజన్లో భాగంగా కొంతమంది కంటెస్టెంట్లను ఇప్పటికే ఎంపిక చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే బిగ్ బాస్ కార్యక్రమం గురించి తాజాగా దర్శకుడు విజయ్ భాస్కర్ అల్లుడు యువ నటుడు రవి శివతేజ బిగ్ బాస్ కార్యక్రమం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దర్శకుడు విజయభాస్కర్ కూతురు శ్యామలనుప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి రవి శివతేజ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు..తాజాగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా శివ రవితేజ తనుకు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చిందని తెలిపారు.
తాను బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటాను అంటే తన భార్య తనకు విడాకులు ఇస్తానని బెదిరించింది అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఇష్టం ఉన్నప్పటికీ తన భార్యకు మాత్రం ఇష్టం లేదు అంటూ ఈ సందర్భంగా ఈయన కామెంట్స్ చేశారు..ఇక శివ రవితేజ తన కెరీర్ గురించి మాట్లాడుతూ తాను నటుడిగా దాదాపు 400 పైగా వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్స్ లో నటించానని తెలిపారు.
సినిమాల్లో కూడా చిన్నచిన్న అవకాశాలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు..ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని ఈ కార్యక్రమం సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి ప్రసారం కాబోతుందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…