Featured

Anushka Shetty : మళ్ళీ బొద్దుగా తయారైన స్వీటీ.. కొత్త సినిమా కోసం మళ్ళీ సైజు జీరో కి అమ్మడు.. వైరల్ అవుతున్న పిక్స్..!

Anushka Shetty : సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అనుష్క ఆ తరువాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో హిట్టు కొడుతూ లేడీ సూపర్ స్టార్ అయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ గా నిలిచిన అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి. హీరోలతో సమానమైన ఇమేజ్ సంపాదించిన ఈ తరం నటీమణులలో ముందుంటుంది అనుష్క. విక్రమార్కుడు, లక్ష్యం, శౌర్యం, చింతకాయల రవి, డార్లింగ్ రెబెల్, బిల్లా వంటి చిత్రాలతో గ్లామర్ డాల్ గా మెప్పించిన అనుష్క, ఆ తరువాత అరుంధతి వంటి లేడీ ఓరియంట్ సినిమాతో లేడీ సూపర్ స్టార్ గా నిలిచింది. ఇక ఆ తరువాత పంచాక్షరి, భాగమతి, నిశ్శబ్దం, రుద్రమదేవి సినిమాలు ఒక ఎత్తు అయితే, బాహుబలి లో దేవసేన గా నటన మరో ఎత్తు. సినిమాకోసం రిస్క్ చేయడం హీరోలకు కామన్ కానీ సినిమాల కోసం హీరోయిన్ రిస్క్ చేయడం అరుదు. ఆది కూడా లావెక్కి తన బాడీ ఫిగర్ ను కోల్పోవడం అంటే హీరోయిన్లు ఒప్పుకోరు. కానీ స్వీటీ అలా కాదు. అందుకే తాను అందరి హీరోయిన్లలో భిన్నంగా హీరోలతో సమానంగా నిలబడింది.

లావెక్కిన బొమ్మాళి… కొత్త సినిమాకోసం మళ్ళీ బొద్దుగా…

సూపర్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకోసం బైక్ చేజింగ్ సన్నివేశాలు చేసిన బొమ్మాళి ఆ తరువాత సైజుజీరో సినిమాకోసం లావుగా తయారైంది. మరో హీరోయిన్ అయితే ఈ సాహసం చేయాలంటే ఆలోచించేవాళ్లేమో కానీ అనుష్క ఏ మాత్రం ఆలోచించకుండా లావుగా చబ్బిగా తయారైంది. అయితే అనుష్క కష్టపడినా సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. ఇక మళ్ళీ సన్నబడటానికి చాలా కష్టపడిన స్వీటీ మళ్ళీ ఇపుడు సినిమా కోసం లావైంది.

తాజాగా వైరల్ అవుతున్న అమ్మడి ఫోటోల్లో బొద్దుగా కనిపిస్తోంది. నాలుగేళ్ల తరువాత మళ్ళీ సినిమాలో నటిస్తున్న అనుష్క నిశ్శబ్దం సినిమా తరువాత మరే సినిమా చేయలేదు. మళ్ళీ ఇన్నాళకు నవీన్ పోలిశెట్టి సినిమాలో నటిస్తున్న అనుష్క సినిమా కోసం మళ్ళీ లావుగా తయారైనట్లు అనిపిస్తోంది. బొద్దుగా ముద్దుగా ఉన్న స్వీటీ ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. సినిమా కోసం ఏదైనా చేస్తుంది అనుష్క అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago